పిచ్చిదానా అన్నారని.. భర్త గొంతుకోసి, పసిపిల్లల్ని బావిలోకి తోసిన భార్య...

Published : Jan 06, 2021, 12:17 PM IST
పిచ్చిదానా అన్నారని.. భర్త గొంతుకోసి, పసిపిల్లల్ని బావిలోకి తోసిన భార్య...

సారాంశం

పదే పదే పిచ్చిది అంటున్నారని నిద్రపోతున్న భర్తను గొంతుకోసి చంపిందో భార్య. ఆ తరువాత ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసి తానూ దూకింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహిలో సోమవారం చోటుచేసుకుంది. 

పదే పదే పిచ్చిది అంటున్నారని నిద్రపోతున్న భర్తను గొంతుకోసి చంపిందో భార్య. ఆ తరువాత ముగ్గురు పిల్లల్ని బావిలోకి తోసి తానూ దూకింది. ఈ దారుణ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మర్వాహిలో సోమవారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్వాహి జిల్లా అమదేదా గ్రామానికి చెందిన విధ్యా పైక్రా(32) మానసిక పరిస్థితి బాగోలేదు. దీంతో భర్త అనూప్‌ సింగ్‌ పైక్రా, అత్త ఆమెను ‘పిచ్చిదానా’ అంటూ ఎగతాళి చేసేవారు.  

అలా పిలవద్దని ఆమె వారితో గొడవపడేది. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విధ్యా సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రలేచి, గాఢనిద్రలో ఉన్న భర్త గొంతును కత్తితో కోసి చంపింది. 

అనంతరం 1,2,4 సంవత్సరాల వయసు కలిగిన ముగ్గురు ఆడపిల్లలను బయటకు తీసుకెళ్లి, దగ్గరలోని బావిలో తోసేసింది. వారు నీటిలో పడి సహాయం కోసం అరవటం ప్రారంభించారు. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు అక్కడికి చేరుకుని చిన్నారులను బయటకు తీశారు.

ఆమె అనూప్‌ను హత్య చేయటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

పూరి జగన్నాథ రథయాత్రలో అద్భుత దృశ్యాలు | Puri Jagannath Rath Yatra 2026 Lord Jagannath from Puri
వివాహేతర సంబంధం నేరం కాకపోతే.. హోటళ్లలో పోలీసుల దాడులు ఎందుకు? అసలు చట్టం ఏం చెబుతోంది?