కొడుకుకు మోడీ పేరు పెట్టుకొన్న ముస్లిం దంపతులు

Published : May 26, 2019, 04:05 PM IST
కొడుకుకు మోడీ పేరు పెట్టుకొన్న ముస్లిం దంపతులు

సారాంశం

బీజేపీ ఘన విజయం విజయం సాధించడం పట్ల ఓ ముస్లిం దంపతులు  తమకు పుట్టిన కొడుకుకు నరేంద్ర మోడీ అని పేరు పెట్టుకొని  తమ హర్షం వ్యక్తం చేశారు.

లక్నో: బీజేపీ ఘన విజయం విజయం సాధించడం పట్ల ఓ ముస్లిం దంపతులు  తమకు పుట్టిన కొడుకుకు నరేంద్ర మోడీ అని పేరు పెట్టుకొని  తమ హర్షం వ్యక్తం చేశారు.

యూపీ రాష్ట్రానికి చెందిన  మీనాజ్ బేగం ఈ నెల 23వ తేదీన పుత్రుడికి జన్మనిచ్చింది. ఆమె భర్త దుబాయ్‌లో ఉన్నాడు. అదే రోజున ఆమె భర్త ఫోన్ చేసి నరేంద్ర మోడీ గెలిచాడా అని అడిగినట్టుగా ఆమె చెప్పింది. మోడీ గెలిచిన విషయం తాను తన భర్తకు చెప్పానన్నారు. 

మోడీ మాదిరిగానే తన కొడుకు మంచి పనులు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను నరేంద్ర మోడీ అని పేరు పెట్టినట్టు చెప్పారు. నరేంద్ర మోడీ తీసుకొన్న పథకాలు పేదలకు చాలా ఉపయోగపడ్డాయని  ఆమె అభిప్రాయపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?