ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల అక్కాచెళ్లెళ్లు...!

Published : Dec 05, 2022, 09:38 AM IST
ఒకే వ్యక్తిని పెళ్లాడిన  కవల అక్కాచెళ్లెళ్లు...!

సారాంశం

ఒకే వేదికపై పెళ్లి చేయాలని కొందరు అనుకుంటే... వారికి వచ్చే తోడు కూడా... కవలలు అయితే బాగుండని కొందరు చూస్తారు. అయితే.... ఓ కవల అక్కా చెల్లెళ్లు మాత్రం ఒకే వ్యక్తిని పెళ్లాడారు. 

ఇంట్లో కవల పిల్లలు ఉంటే... చిన్నప్పటి నుంచి ఒకేలాంటి దుస్తులు వేయడం, ఒకేలా ముస్తాబు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ గా జరిగే విషయం. ఇక పెళ్లి ఈడు వచ్చిన తర్వాత కూడా... ఒకే వేదికపై పెళ్లి చేయాలని కొందరు అనుకుంటే... వారికి వచ్చే తోడు కూడా... కవలలు అయితే బాగుండని కొందరు చూస్తారు. అయితే.... ఓ కవల అక్కా చెల్లెళ్లు మాత్రం ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

షోలాపూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ప్రస్తుతం ఈ  పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో ఐటీ ఇంజినీర్లుగా ఉన్న సోదరీమణులు శుక్రవారం ఆ వ్యక్తితో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం.

 

పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఈ వివాహం చెల్లుబాటు అవుతుందా లేదా హిందూ వివాహ చట్టం ప్రకారం అనుమతించబడిందా లేదా అని కామెంట్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి పెరగడంతో.. వారు పెళ్లి కూడా ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.  దీంతో అక్కాచెల్లెళ్లిద్దరూ అతుల్ అనే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

వరుడు అతుల్ మల్షిరాస్ తాలూకా నివాసి. అతనికి ముంబైలో ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం ఉంది. కాగా.. వధువులకు తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తండ్రి  మరణానంతరం బాలికలు తల్లితో కలిసి జీవించారు. ఇటీవల వారి తల్లి కూడా అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తీసుకువచ్చే క్రమంలో... అతుల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. వీరి ముగ్గురు పెళ్లి వైపు అడుగులు వేయడం విశేషం. వారు ముగ్గురు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం విశేషం.


 


 
 

 
 

PREV
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?