అర్నబ్‌ గోస్వామికి సుప్రీంలో ఊరట: మధ్యంతర బెయిల్ మంజూరు

Published : Nov 11, 2020, 04:50 PM IST
అర్నబ్‌ గోస్వామికి సుప్రీంలో ఊరట: మధ్యంతర బెయిల్ మంజూరు

సారాంశం

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బుధవారం నాడు  బెయిల్ మంజూరు చేసింది.

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బుధవారం నాడు  బెయిల్ మంజూరు చేసింది.

2018లో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ అతని తల్లి ఆత్మహత్య కేసులో అర్నబ్ గోస్వామితో పాటు మరో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

also read:మేం రిపబ్లిక్ టీవీ చూడం.. కానీ: అర్నాబ్ కేసులో సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు

ఈ కేసులో అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. డివై చంద్రచూడ్, ఇందిర బెనర్జీ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపింది.వీడియో కాన్పరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. 

తనను అరెస్ట్ చేయడంతో పాటు అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ కేసును తిరిగి ఓపెన్ చేయడాన్ని సవాల్ చేస్తూ ముంబై హైకోర్టు గోస్వామి పెట్టుకొన్న పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నెల 4వ తేదీన అర్నబ్ గోస్వామిని ముంబై్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇంట్లో ఉన్న అతడిని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు తనను కొట్టారని కూడ అర్నాబ్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

Moon Earth : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu