తునీశా శర్మను హాస్పిటల్ తీసుకెళ్లుతున్నప్పటి సీసీటీవీ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

Published : Dec 27, 2022, 08:13 PM ISTUpdated : Dec 27, 2022, 08:15 PM IST
తునీశా శర్మను హాస్పిటల్ తీసుకెళ్లుతున్నప్పటి సీసీటీవీ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

సారాంశం

తునీశా శర్మను హాస్పిటల్‌కు తీసుకెళ్లుతున్న సీసీటీవీ వీడియో ముందుకు వచ్చింది. సూసైడ్ చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించడానికి ఆమె ఫ్రెండ్స్, షీజన్ ఖాన్ కూడా హాస్పిటల్ తీసుకెళ్లుతున్నట్టు ఆ వీడియోలో కనిపించింది.  

న్యూఢిల్లీ: అపస్మారక స్థితిలో ఉన్న తునీశా శర్మను హాస్పిటల్‌కు తీసుకెళ్లుతున్న ఓ సీసీటీవీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తునీశా శర్మ డిసెంబర్ 24వ తేదీన పాల్‌గడ్‌లో ఆమె యాక్ట్ చేస్తున్న అలీ బాబా షో సెట్‌లో సూసైడ్ చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. మేకప్ రూమ్‌లో ఆమె ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.

ఆమె మరణించిన కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో కదలకుండా నిర్జీవంగా కనిపిస్తున్న తునీశ శర్మను కొంత మంది హడావిడిగా హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. కారును పార్క్ చేసి మెట్లను ఎక్కుతున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఈ వీడియోలో తునీశా శర్మను తీసుకెళ్లుతున్నవారిలో ఆమె ఎక్స్ లవర్ షీజన్ ఖాన్ కూడా ఉన్నాడు.

తునీశా శర్మ ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణల కింద షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: శ్రద్ధా వాకర్ హత్య కేసు చూసి బ్రేక్ అప్ నిర్ణయం తీసుకున్నా..: పోలీసుల విచారణలో నటి తునీషా శర్మ బాయ్‌ఫ్రెండ్

తునీశా శర్మ ఆత్మహత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు షీజన్ ఖాన్, ఆమె బ్రేక్ అప్ తీసుకున్నట్టు సమాచారం.

పోలీసు కస్టడీలో తన తొలి రోజు షీజన్ ఖాన్ వాలివ్ పోలీసులకు తునీషా శర్మతో బ్రేక్ అప్ చేసుకోవడానికి కారణాలను వెల్లడించారు. శ్రద్ధా వాకర్ తర్వాత దేశంలో ఏర్పడ్డ పరిస్థితులను చూసి తునీషా శర్మతో రిలేషన్‌షిప్ ముగించుకున్నా అని తెలిపారు. తామిద్దరమూ వేర్వేరు మతస్తులమని వివరించారు. అలాగే, తమ మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. షీజన్‌కు 28 ఏళ్లు.. తునీషా శర్మకు 20 ఏళ్లు.

Also Read: సీరియల్ నటి తునీషా మృతి కేసు.. సహనటుడు షీజాన్‌ అరెస్ట్.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..!

తునీషా శర్మ సూసైడ్ స్పాట్‌ లో సూసైడ్ లెటర్ ఏదీ పోలీసులకు లభించలేదు.

మహారాష్ట్ర కు చెందిన శ్రద్ధా వాకర్, ఆఫ్తాబ్ పూనావాలా ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కలిసి ఉన్నారు. ఆ తర్వాత వారు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే శ్రద్ధా వాకర్‌ను ఆప్తాబ్ పూనావాలా దారుణంగా చంపేశాడు. ఆమె డెడ్ బాడీని 35 భాగాలుగా నరికి రాత్రి 2 గంటల సమయంలో కొన్ని రోజులపాటు ఆ శరీర భాగాలను మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో వేర్వేరు చోట్ల పడేసి వచ్చాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ రోజు పోలీసుల విచారణలో షీజన్ ఖాన్ కన్నీరుమున్నీరు అయినట్టు సమాచారం అందింది.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu