3 గంటలు... 100 కోట్లు @ ట్రంప్ పర్యటన ఖర్చు ఇది

By telugu teamFirst Published Feb 16, 2020, 11:45 AM IST
Highlights

ఫిబ్రవరి 24- 25 తేదీలలో ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీతో కలిసి ఒక ఈవెంట్ లో ఉపన్యసించనున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజ్ మహల్, ఢిల్లీ తో సహా ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా పర్యటించనున్న విషయం ఖరారయిపోయింది కూడా. 

ఫిబ్రవరి 24- 25 తేదీలలో ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీతో కలిసి ఒక ఈవెంట్ లో ఉపన్యసించనున్నారు. 

Also read; ట్రంప్ భారత పర్యటన: కథ మొత్తం చికెన్ లెగ్ పీసుల చుట్టూనే..!!

ట్రంప్ దాదాపుగా మూడు గంటల పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గడపనున్నారు. ఈ మూడు గంటల పర్యటన కోసం అధికారులు 100 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో అధికశాతం అహ్మదాబాద్‌ నగర పాలక సంస్థ , అహ్మదాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ భరిస్తున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం కేవలం 14 కోట్లు మాత్రమే అందజేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. నగర సుందరీకరణ కోసం ఈ నిధులన్నిటినీ ఖర్చు చేస్తున్నారు. ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. 

కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతుకు రూ. 80 కోట్లు కేటాయించగా.. ట్రంప్‌ భద్రతకు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. మోటేరా స్టేడియంలో దాదాపు లక్ష మంది అతిథుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 7 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. 

Also read; త్వరలో భారత్ పర్యటన.. మోదీకి ట్రంప్ భార్య ధన్యవాదాలు

రోడ్ల మధ్యలో ఈత జాతి చెట్ల ఏర్పాటుకు రూ.6 కోట్లు, మోదీ-ట్రంప్‌ రోడ్‌షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం 4 కోట్లను వెచ్చించనున్నారు. ట్రంప్‌ రోడ్‌షోకు భారీ భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. సుమారు 10 వేల మంది పోలీసులతో పటిష్టమైన నిఘా, రక్షణ చర్యలను చేపడుతున్నారు. 

ఇక భారత పర్యటనకు ముందు ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్య నెటిజెన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ కి గురి అయింది. ఫేస్‌బుక్‌లో తానే నంబర్‌-1 అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. తాను నెంబర్ 1 స్థానంలో ఉండగా నంబర్‌-2 స్థానంలో భారత ప్రధాని మోడీ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

ఇక అంతే నెటిజెన్ల లెక్కలతోసహా ఇది అవాస్తవమని తేల్చారు.  ట్రంప్ కన్నా మోడీకే లికెస్ ఎక్కువగా ఉన్నాయని, అంతే కాకుండా... వీరిద్దరికన్నా రొనాల్డోకి ఎక్కువ లికెస్ ఉన్నాయంటూ సెటైర్లు వేశారు నెటిజన్లు. 

click me!