Azadi Ka Amrit Mahotsav: మేడారం జాతరకు కోట్లాది మంది

Published : Feb 17, 2022, 06:13 PM IST
Azadi Ka Amrit Mahotsav: మేడారం జాతరకు కోట్లాది మంది

సారాంశం

తెలంగాణ ములుగు జిల్లాలోని మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి సమ్మక్క, సారలమ్మల జాతర ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి మేడారం జాతర ఈ నెల 16వ తేదీన ప్రారంభమైంది. తొలి రోజు సారలమ్మను గద్దె మీదకు తెచ్చారు. ఈ రోజు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు విచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజదీ కా అమృత్ మహోత్సవ్‌లో మేడారం జాతర సంబురాలను గుర్తు చేసింది.   

హైదరాబాద్: రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం(Medaram) జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతర తొలి రోజు 16వ తేదీన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇది మన దేశంలో జరిగే రెండో అతిపెద్ద కుంభమేళ. తెలంగాణ(Telangana)లోని రెండో అతిపెద్ద కమ్యూనిటీ కొయలు(Koya) జరిపే నాలుగు రోజుల సంరంభం. ఆసియాలోనే కోయలు నిర్వహించుకునే అతిపెద్ద పండుగ. ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ మాసంలో ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మ(Sammakka, Saralamma)ను ఈ వేడుకలో కొలుస్తారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలోని గద్దెలపై వీరిని కొలువుదీర్చి మొక్కులు అప్పజెప్పుతారు. ఎప్పటిలాగే, ఈ ఏడాది కూడా భక్తులు ఎంతో పారవశ్యంతో వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ జాతర తొలి రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు మేడారం చేరుకున్నారు. కోట్లాది మంది భక్తులు ఈ జాతరకు ఇప్పటికే తరలి వచ్చినట్టు కేంద్రం గిరిజన వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మన దేశంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ జాతరను గుర్తించి ఓ ప్రకటన విడుదల చేసింది.

సమ్మక్క, సారలమ్మలు కాకతీయుల కాలం నాటి వీర వనితలు. సమ్మక్క కూతరు సారలమ్మ. వారి త్యాగాలను స్వరిస్తూ అక్కడి గిరిజన, కోయలు ఈ వేడుకలు జరుపుకుంటారు. సమ్మక్క, సారలమ్మ దేవుళ్లను ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కొలుస్తుంటారు. నాలుగు రోజులపాటు మేడారం జాతర ఘనంగా జరుగుతుంది. జాతర తొలిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను చప్పుళ్లు, గిరిజనుల సంప్రదాయంలో తెచ్చి మేడారం గద్దెపై ప్రతిష్టిస్తారు. ఇదే రోజు సమ్మక్క భర్త పగిడిగిద్ద రాజును కొత్తగూడె మండలంలోని పునుగొండ్ల నుంచి తెచ్చి మేడారం గద్దపై కొలువుదీరుస్తారు. అదే విధంగా గోవిందరాజు, నాగులమ్మలను కొండాయి గ్రామం నుంచి మేడారానికి తెస్తారు.

సమ్మక్క, సారలమ్మలను గద్దె మీద ప్రతిష్టించిన తర్వాత భక్తులు బంగారాన్నివారికి సమర్పిస్తారు. మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణలో మేడారంలో ఈ జాతర ఘనంగా జరుగుతుంది. అయితే, రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ అనేక చోట్ల సమ్మక్క, సారలమ్మల గద్దెలు ఉన్నాయి. మేడారం రాలేకపోయిన వారు వారి గ్రామాలకు సమీపంలోని గద్దెల వద్ద ఇదే విధంగా సమ్మక్క, సారలమ్మలను తెచ్చి కొలువుదీర్చి మొక్కులు అప్పజెప్పుతారు. చిన్నా, పెద్ద అందరూ భక్తి పారవశ్యంతో జాతరలో పాల్గొంటారు. మేడారంలో జరిపే ఈ జాతరను అక్కడి కోయలు సామూహికంగా నిర్వహిస్తుంటారు. వారి తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ సమన్వయంతో ఈ వేడుకలు చేస్తారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఈ జాతరను సపోర్ట్ చేస్తున్నది. దాదాపు ఈ పండుగలోని అన్ని కార్యక్రమాలను కవర్ చేస్తున్నది. తెలంగాణలోని షెడ్యూల్డ్ ట్రైబల్స్ ప్రత్యేకతను ప్రచారం చేయడానికి, కాపాడటానికి సర్వదా కృషి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ జాతర గిరిజనుల సంస్కృతి, వారి పండుగలు, వారసత్వంపై అవగాహన కలిగిస్తాయని, అలాగే, తెలంగాణలోని గిరిజన సముదాయాలకు, అక్కడి వచ్చే సందర్శకుల మధ్య ప్రేమపూర్వక బంధాన్ని ఏర్పరచడానికి దోహదపడుతుందని పేర్కొంది.

జాతర ప్రాంగంణంలో రూ. 75 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టారు. ఈ జాతరకు 4 వేల RTC బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడుపుతుంది.  Jataraకు వచ్చే భక్తుల కోసం 327 ప్రాంతాల్లో  20 వేలకు పైగా శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం  1100 ఎకరాలను సిద్దం చేశారు. 32 ఎకరాల్లో బస్ స్టేషన్ ను ఏర్పాటు చేవారు. జంపన్న వాగు వరకు 25 బస్సులు నిరంతరం నడిచేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?