Punjab Election 2022: " పంజాబీలు మాత్ర‌మే పాలించాలి".. చ‌న్నీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన ప్రియాంక గాంధీ

Published : Feb 17, 2022, 05:11 PM IST
Punjab Election 2022: " పంజాబీలు మాత్ర‌మే పాలించాలి".. చ‌న్నీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన ప్రియాంక గాంధీ

సారాంశం

Punjab Election 2022:  చన్నీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, పంజాబ్‌ను పంజాబీలు మాత్రమే పాలించాలనే ఉద్దేశంలో చన్నీ అలా  వ్యాఖ్యానించార‌ని ప్రియాంక గాంధీ వివరణ ఇచ్చారు. కానీ ఆయన మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ర‌వ‌త్త‌రంగా సాగుతోంది.  పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న రాజకీయ పార్టీల మధ్య .. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలను ఉద్దేశించి పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ చేసినా..యుపి, బీహార్ కే భయ్యా వ్యాఖ్యలు కాక‌రేపుతున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై ఇరుప‌క్షాల నేత‌లు ఒకరిని మించి మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద కావ‌డంతో తీవ్ర వివాదానికి దారి తీశాయి. 

చన్నీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ మండి ప‌డ్డారు. సీఎం ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేటు అని ఘాటూగా విమ‌ర్శించారు. చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని ప్రియాంక గాంధీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. తనకు తాను యూపీ కూతురిగా చెప్పుకొంటారని చన్నీ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టారని విమర్శించారు. పంజాబేతరులైన సంత్ రవిదాస్, గురు గోవింద్ సింగ్‌లను అవమానించారంటూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం మాటల దాడికి దిగారు.

'యుపి, బీహార్ కే భయ్యా' వ్యాఖ్యను ప్రధాని నరేంద్ర మోడీ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా పంజాబేతరులైన సంత్ రవిదాస్, గురు గోవింద్ సింగ్‌లను అవమానించారంటూ ఆరోపించారు.ప్రాంతీయ‌త ఆధారంగా ప్రజల మధ్య విభేదాలు సృష్టించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు.  ఇలా.. సీఎం చ‌న్నీ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో దూమారం రేగ‌డంతో.. చన్నీ వ్యాఖ్యలను సరిదిద్దేందుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రయత్నించారు.  

చన్నీ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని స‌మ‌ర్ధించారు. పంజాబ్‌ను పంజాబీలు మాత్రమే పాలించాలనే ఉద్దేశంలో చన్నీ అలా మాట్లాడర‌నీ, కానీ ఆయన మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  UP నుండి అయినా బిహార్ నుంచి అయినా ఇంకెక్కడి నుంచైనా పంజాబ్‌కు రావొచ్చున‌ని అన్నారు. కానీ పంజాబ్ పాలించాల‌ని యూపీ నేత‌లు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.   

లఖింపూర్ ఖేరీ హింసను ప్రస్తావిస్తూ.. ప్రియాంక గాంధీ వాద్రా యూపీలో రైతులను బీజేపీ అవమానించిందని అన్నారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కూడా నిందితులుగా ఉన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో కేంద్రం ఉత్తరప్రదేశ్‌కు ద్రోహం చేసిందని ప్రియాంక విమర్శలు గుప్పించారు. రైతులను కారుతో తొక్కించి చంపించిన వ్యక్తిని జైలు నుంచి బయటికి తీసుకురావడమే కాకుండా వారి కుటుంబ సభ్యుల్ని మంత్రులుగా కొనసాగించడం రైతులను అవమానించడమేనని ఆమె అన్నారు. 

ప్రధానమంత్రి పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మాత్రమే సందర్శిస్తున్నారు, కానీ రైతుల నిరసన సమయంలో పంజాబ్ కు ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ పాల‌న‌లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గరిష్ఠ స్థాయిని దాటి పెరిగిపోతుంటే మోదీ మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లే పనిలో ఉన్నారని ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. ఢిల్లీని సరిగ్గా పాలించడంలో విఫలమైన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్‌ను పాలించగలనని చెబుతున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sunita Williams Inspires India: వ్యోమగామి సునీతా విలియమ్స్ పవర్ ఫుల్ ఇంటర్వ్యూ | Asianet News Telugu
FASTag : ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్... టోల్ గేట్లు వద్ద నో క్యాష్