Jammu and Kashmir: ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. శ్రీనగర్‌లో 11 చోట్ల‌ NIA దాడులు

By Rajesh KFirst Published Jun 23, 2022, 2:35 AM IST
Highlights

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొరడా ఝళిపించింది.జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలైన టిఆర్‌ఎఫ్, జైషే మహ్మద్ కార్యకలాపాలకు సంబంధించి కుల్గామ్ నివాసి ముదాసిర్ అహ్మద్ దార్‌ను NIA అరెస్టు చేసింది.  
 

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొరడా ఝళిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం నాడు ముమ్మరంగా దాడులు చేసింది. జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలైన టిఆర్‌ఎఫ్, జైషే మహ్మద్ కార్యకలాపాలకు సంబంధించి కుల్గామ్ నివాసి ముదాసిర్ అహ్మద్ దార్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) అరెస్టు చేసింది. ఈ కేసులో మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని 4 నగరాల్లోని 11 చోట్ల NIA దాడులు చేసింది.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ కుట్రను NIA స్వయంచాలకంగా తీసుకుందని ఎన్‌ఐఎ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  TRF ఉగ్రవాద సంస్థపై నిఘా పెట్టిన NIA.. లష్కర్లను మ‌ద్ద‌తుగా ప‌ని చేస్తుంద‌ని గుర్తించింది. ఈ సంస్థ కమాండర్ సజ్జాద్ గుల్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప‌థ‌కం రూపొందించాడ‌ని గుర్తించింది.  

ఈ పథకం ప్రకారం.. ఈ ఉగ్రవాద కమాండర్ వివిధ ప్రదేశాలలో యువకులను ప్రేరేపించి.. తన ఉగ్రవాద సంస్థలో చేర్చుకుంటున్నాడని ఏజెన్సీ గుర్తించింది. విశ్వ‌నీయ సమాచారం ఆధారంగా NIA..  18 నవంబర్ 2021 న క్రిమినల్ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో అందిన సమాచారం మేరకు శ్రీనగర్, కుల్గాం, పుల్వామా, గందర్‌బల్ ప్రాంతాల్లోని 11 చోట్ల ఎన్‌ఐఏ బుధ‌వారం దాడులు నిర్వహించింది. కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన అలీ మహ్మద్ దార్ కుమారుడు ముదాసిర్ అహ్మద్ దార్ .. కుల్గాం జిల్లా యారిపోరాలోని నోపురా ఖర్పురా పోలీస్ స్టేషన్ ప‌రిధిలో నివాసం ఉంటున్నాడని ఏజెన్సీకి సమాచారం అందింది.

ముదాసిర్ అహ్మద్ దార్ టెర్రరిస్టులకు లాజిస్టిక్ సపోర్టు అందిస్తున్నాడని, దీనితో పాటు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తున్నాడ‌ని ఎన్ఐఏ గుర్తించింది. ఇటీవ‌ల‌ కాశ్మీర్‌లో జ‌రిగిన వ‌రుస‌ హత్యలకు TRF కారణమని నిఘా వ‌ర్గాలు విశ్వ‌సిస్తున్నాయి. 

ముదాసిర్ అహ్మద్ దార్‌ను ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.. ఉగ్ర‌ సంస్థల‌కు మందుగుండు సామాగ్రి, యుధాలను ఎక్కడ సరఫరా చేశాడో NIA తెలుసుకోవాలనుకుంటోంది. ఈ సంస్థలోని ఉగ్ర‌వాదులు ఎక్కడ చురుకుగా ఉన్నారు? వారి రాబోయే ప్లాన్‌లు ఏమిటి? దార్‌ను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించి.. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

click me!