భ్యార్యభర్తలిద్దరికీ అదే సమస్య.. ఆ ఆలోచనే వారిని ఇప్పుడు కోట్లు సంపాదించేలా చేసింది

By Mahesh Rajamoni  |  First Published Aug 28, 2023, 4:27 PM IST

మనకు ఏదైన సమస్య ఎదురైతే ఏం చేస్తాం.. ఏముంది మంచి హాస్పటల్ కు చూపించుని తగ్గించుకుంటాం. ఆ తర్వాత మన పని మనం చూసుకుంటాం.. కానీ ఓ జంట మాత్రం వారి సమస్యకు పరిష్కారాన్ని కనుగొని.. దానితోనే వ్యాపారం స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు తెలుసా?


నిజ జీవిత అనుభవాలతో కంపెనీలను పెట్టి మంచి లాభాలను పొందిన వారు, కోటీశ్వరులు అయిన వారు చాలా మందే ఉన్నారు. నిజ జీవిత అనుభవాలను ఎదుర్కొన్న తర్వాత  అభివృద్ధి చేసిన అనేక బ్రాండ్లు ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో ఉన్నాయి. నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలను స్థాపించి కోట్లను అర్జిస్తున్నారు. ఎందుకంటే అలాంటి సమస్యలు తమకు మాత్రమే లేవు కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే తమ నిజ జీవితంలో ఎదురైన సమస్యను పరిష్కరించి.. దానిమీదే ఒక కంపెనీని స్థాపించి కోట్లు సంపాదిస్తున్నారో జంట. ఇంతకీ వారి సమస్య ఏంటి? ఆ జంట ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలని వారు ఏ నూటికో.. వెయ్యి మందిక ఒకరో ఉంటారు. అయితే సలోని ఆనంద్, ఆమె భర్త అల్తాఫ్ సయ్యద్ ఇద్దరికీ హెయిర్ ఫాల్ సమస్య ఉంది. అయితే ఈ హెయిర్ ఫాల్ నుంచే వారు ఒక కంపెనీని స్థాపించి ఇప్పుడు మంచి లాభాలను పొందుతున్నారు. జుట్టు కేవలం వాటర్ సమస్య, కాలుష్యం, రసాయన చికిత్సల వల్ల మాత్రమే రాలని.. జుట్టు రాలడానికి అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని ఈ జంట గ్రహించింది. 

Latest Videos

జుట్టు రాలడాన్ని తగ్గించే దిశగా ఈ జంట 2019 లో ట్రాయాను ప్రారంభించారు. ఆయుర్వేద మార్కెట్ ను అన్వేషిస్తూ.. మూలాల్లో జుట్టు సమస్యలను పరిష్కరించడానికి తమ జర్నీని స్టార్ట్ చేశారు. 2022 జనవరిలో ఫైర్సైడ్ వెంచర్స్ నేతృత్వంలో జరిగిన ఫండింగ్ రౌండ్ లో ఈ కంపెనీ 2.2 మిలియన్ డాలర్లను సమీకరించింది.

సలోని ఆనంద్ ఎవరు? 

undefined

హైదరాబాద్ లో అల్తాఫ్ ను కలిసిన ఈమె 2017లో పెళ్లి చేసుకుంది. తన సొంత కంపెనీకి ముందు సలోని ఆరోగ్య సంరక్షణ సంస్థ కాస్ట్లైట్ లో మూడేండ్లు పనిచేసింది. ఆ తరువాత ఆమె మార్కెటింగ్ లో ఎంబిఎ చేసింది. అంతేకాదు ఈమె Upshot.ai అనే సాస్ ప్రొడక్ట్ స్టార్టప్ కు మూడేళ్ల పాటు నేతృత్వం వహించింది కూడా. 

ఇక ట్రాయాను స్థాపించడానికి ముందు అల్తాఫ్ తన ఫుడ్ డెలివరీ స్టార్టప్ బిల్ట్ 2 కుక్ నడిపాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థి ఈయన. ఇతను 2012-14లో ఎంబీఏ పూర్తి చేశారు. గ్లాస్గో విశ్వవిద్యాలయం (2002 - 2006) నుంచి మెడికల్ బయోకెమిస్ట్రీలో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది.

click me!