మద్యం మత్తులో ఒంటికి నిప్పు అంటించుకున్న హిజ్రా

Published : Apr 14, 2021, 03:09 PM IST
మద్యం మత్తులో ఒంటికి నిప్పు అంటించుకున్న హిజ్రా

సారాంశం

మద్యం అలవాటు వున్న లారా రోజూ మద్యం తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఇరుగుపొరుగుతో చెప్పేవాడు. 

మద్యం మత్తులో ఓ హిజ్రా.. ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం వ్యాసార్పాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై వ్యాసార్పాడి బి.కల్యాణపురం ఆరవ వీధికి చెందిన నాగప్పన్‌ భార్య రాజకళ. వీరికి వున్న నలుగురు పిల్లలు. పెద్ద కుమారుడు సూర్య అనే లారా (29). నాలుగేళ్ల ముందు హిజ్రాగా మారాడు. ఇంట్లోవాళ్లకు తెలీకుండా హిజ్రా అవతారం ఎత్తాడు. 


అయితే.. మద్యం అలవాటు వున్న లారా రోజూ మద్యం తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ఇరుగుపొరుగుతో చెప్పేవాడు. సోమవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన లారా ఇంటిలో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. గాయపడ్డ అతన్ని చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కాగా... ఈ ఘటనపై కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu