ప్రాణం తీసిన మ్యాజిక్...జాదూగర్‌ మంద్‌రాకే మృతదేహం లభ్యం

By telugu teamFirst Published Jun 18, 2019, 9:32 AM IST
Highlights

అందరినీ విస్మయానికి గురిచేసేలా మ్యాజిక్ చేయాలనుకున్నాడు.. కానీ ఆ మ్యాజిక్ అతని ప్రాణాలు తీసేసింది. రెండు రోజుల క్రితం కోల్ కత్తాలో మ్యాజిక్ చేస్తూ... గల్లంతైన మేజిషియన్ జాదూగర్ మంద్ రాకే మృతదేహం లభ్యమైంది.
 


అందరినీ విస్మయానికి గురిచేసేలా మ్యాజిక్ చేయాలనుకున్నాడు.. కానీ ఆ మ్యాజిక్ అతని ప్రాణాలు తీసేసింది. రెండు రోజుల క్రితం కోల్ కత్తాలో మ్యాజిక్ చేస్తూ... గల్లంతైన మేజిషియన్ జాదూగర్ మంద్ రాకే మృతదేహం లభ్యమైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...జాదుగర్‌ మంద్‌రాకేగా ప్రసిద్ధి పొందిన చంచల్‌ లాహిరి (40) ఆదివారం పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు చూస్తుండగా విన్యాసానికి నదిలోకి దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో బంధించుకుని, కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగారు. అలా లోపలికి వెళ్లిన.. సురక్షితంగా బయటకు రావడమే మ్యాజిక్. కానీ అలా జరగలేదు. నీటిలోకి వెళ్లిన ఆయన తిరిగి బయటకు రాలేదు. దీంతో... ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా... సోమవారం ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన మృతితో కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఈ లైవ్ స్టంట్ చేయబాడానిక లాహిరి అనుమతి తీసుకున్నారు కానీ... కనీస భద్రతా సదుపాయాలు తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ స్టంట్ చేయడానికి ముందు దీని గురించి ఆయన మాట్లాడారు.‘‘బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ బాక్సులో కూర్చుని సంకెళ్లతో బంధించుకున్నాను. తాళం వేసేశారు. 29సెకన్లలో బయటికి వచ్చేశాను. ఈసారి బయటకు రావడం కష్టమే. బయటకు రాగలిగితే మ్యాజిక్‌ అవుతుంది. లేదంటే ట్రాజిక్‌ అవుతుంది’’  అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే... మ్యాజిక్ ట్రాజెడీగా ఆయన ప్రాణాలు మింగేసింది. 

click me!