ఫాస్టాగ్‌కు సిద్ధం కాని వాహనదారులు: టోల్‌ప్లాజాల వద్ద భారీ ట్రాఫిక్ జాం

By Siva KodatiFirst Published Dec 15, 2019, 3:17 PM IST
Highlights

ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాతీయ రహదారులపై వున్న టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యాన్ని నివారించడంతో పాటు డిజిటల్ పేమెంట్స్‌ను ప్రొత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ విధానం ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

Also Read:ఆధ్మాత్మిక యాత్రలో రియల్ హీరో: సాహో సజ్జనార్ అంటూ.....

అయితే ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో కొంతమంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ లేని వాహనదారులు నగదు చెల్లించేందుకు బారులు తీరడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది.

Also Read:చంద్రబాబు చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... ముప్పేటదాడికి కేసులు సిద్ధం

ఫాస్టాగ్‌కు బదులు నగదు చెల్లించి వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద 5 గేట్ల ద్వారా ఫాస్టాగ్, 3 గేట్ల ద్వారా నగదు చెల్లింపు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

అయితే ఈ మూడు గేట్ల వద్ద రద్దీ అధికంగా ఉంది. అటు కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. రెండు మార్గాల్లోని ఫాస్టాగ్‌లు పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

click me!