కేరళలో కొత్త డిసీజ్.. ‘టమాట ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లోనే వ్యాప్తి.. ఈ వైరస్ లక్షణాలు ఇవే

Published : May 11, 2022, 05:35 PM ISTUpdated : May 11, 2022, 05:39 PM IST
కేరళలో కొత్త డిసీజ్.. ‘టమాట ఫ్లూ’ కలకలం.. చిన్నారుల్లోనే వ్యాప్తి.. ఈ వైరస్ లక్షణాలు ఇవే

సారాంశం

కేరళలో టమాట ఫ్లూ అనే కొత్తరకం డిసీజ్ కలకలం రేపుతున్నది. ఇది కూడా చిన్నారుల్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నది. ఇప్పటి వరకు కనీసం 80 మంది చిన్నారులు ఈ డిసీజ్ బారిన పడ్డారు.  

తిరువనంతపురం: కేరళలో ఇటీవలే ఫుడ్ పాయిజినింగ్ వల్ల 58 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ సమస్యతో సతమతం అవుతుండగా కొత్తగా టమాట ఫ్లూ కలకలం రేపుతున్నది. 80 మంది చిన్నారులకు పైగా ఈ డిసీజ్‌ బారిన పడ్డారు. ఈ టమాట ఫ్లూనే టమాట ఫీవర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ టమాట ఫ్లూ కేసులు అన్నీ కొల్లాం జిల్లాలోనే రిపోర్ట్ అయ్యాయి.

టమాట ఫ్లూ అంటే ఏమిటీ?
ఇదొక అరుదైన వైరల్ డిసీజ్. ఈ డిసీజ్ సోకిన వారి చర్మంపై దద్దుర్లు వస్తాయి. స్కిన్ పై దురద ఉంటుంది. డీహైడ్రేషన్ కలిగిస్తుంది. ఈ టమాట ఫ్లూ బారిన పడ్డవారి చర్మంపై నీటి బుడగల్లాగే బొబ్బలు వస్తాయి. అయితే, ఈ బొబ్బలు టమాటల తరహా ఉంటాయి. అందుకే ఈ డిసీజ్‌ను టమాట ఫ్లూ అంటున్నారు. కేరళలో ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఈ ఫ్లూ వ్యాపించింది.

లక్షణాలు ఇలా ఉంటాయి..
టమాట ఫ్లూ సోకిన వారి చర్మంపై టమాటలుగా కనిపించే బొబ్బలు ఏర్పడతాయి. దీనితోపాటు తీవ్ర జ్వరం, ఒల్లు నొప్పులు, కీళ్ల వాతం ఉంటుంది. చికన్ గున్యా సోకినప్పుడు కలిగినట్టే తీవ్ర నీరసం ఉంటుంది. 

తమిళనాడు, కేరళ సరిహద్దుపై నజర్
పొరుగు రాష్ట్రం కేరళలో టమాట ఫ్లూ కేసులు నమోదు కావడంతో తమిళనాడు వెంటనే అప్రమత్తం అయింది. కేరళ నుంచి కొయంబత్తూర్ జిల్లాలోకి ఎంటర్ అవుతున్నవారిని సిబ్బంది ప్రత్యేకంగా పరిశీలించి అనుమతిస్తున్నారు. టమాట ఫ్లూ లక్షణాలపై ఈ సరిహద్దులో ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులపై నజర్ పెంచారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు సారథ్యంలో ఈ టీమ్‌లు ప్యాసింజర్లను పరిశీలిస్తున్నారు. కాగా, 24 మంది సభ్యులతో ఓ బృందం ఏర్పడి అంగన్వాడీల్లో ఐదేళ్లలోపు పిల్లలను పరీక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కరోనాతో విలవిల్లాడిన దేశాలకు మరో డేంజర్ న్యూస్ ఎదురైంది. తాజాగా, యూకేలో మంకీ పాక్స్ వైరస్ కలకలం రేపింది. నైజీరియాకు వెళ్లి వచ్చిన యూకే వ్యక్తిలో మంకీ పాక్స్ వైరస్ రిపోర్ట్ అయింది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మంకీ పాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ చాలా అరుదుగా జరుగుతాయని, భయపడాల్సిన అవసరం లేదని వివరించింది. ఇది అంత సులువుగా వ్యాపించే వైరస్ కాదని తెలిపింది. ఈ వైరస్ సాధారణంగా ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్ కాదని, ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే ఎక్కువ తీవ్రత కలిగిస్తుందని వివరించింది. ఈ వైరస్‌ బారిన పడ్డ చాలా మంది పేషెంట్లు కూడా సులువగా రికవరీ అయ్యారని పేర్కొంది.

మంకీ పాక్స్ కేసు 2018లో కూడా యూకేలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ వైరస్ కేసులు వేళ్ల మీద లెక్కించిన స్థాయిలో తక్కువగానే రిపోర్టు అయ్యాయి.

మంకీ పాక్స్ లక్షణాలు
స్మాల్ పాక్స్‌కు ఉండే లక్షణాలే చాలా వరకు మంకీ పాక్స్ వైరస్ లక్షణాలుగా ఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కండరాల్లో నొప్పి, తీవ్ర నీరసం వంటివి మంకీ పాక్స్ లక్షణాలుగా చెప్పొచ్చు. ముఖం, చేతులపై చర్మంపై దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఈ వైరస్ మన బాడీలోకి చేరిన ఆరు నుంచి 13 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల వ్యవధి కూడా పడుతుంది. 

ఈ మంకీ పాక్స్ వైరస్ తొలి సారి 1958లో కనిపించింది. కోతులను కొన్ని కాలనీలుగా విభజించి వాటిపై పరిశోధనలు చేశారు. ఆ రీసెర్చ్ జరుగుతున్న సమయంలోనే ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. దీంతో దీనికి మంకీ పాక్స్ అనే పేరే పెట్టేశారు.

కాగా, ఈ వైరస్ తొలిసారి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో‌లో 1970లో చోటుచేసుకుంది. 50 ఏళ్ల క్కరితం తొలిసారి ఈ వైరస్ మనుషఉల్లో కనిపించింది. 

ఈ వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వైరస్ సోకవచ్చు. ఈ వైరస్ మనిషి ద్రవాల నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉన్నది. రక్తం ద్వారా కూడా వ్యాపించవచ్చు. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ