పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌పై అభిశంస‌న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న టీఎంసీ

By team teluguFirst Published Jan 29, 2022, 11:25 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌పై జగ్‌దీప్ ధన్‌ఖర్ పై అభిశంస‌న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని అధికారిక టీఎంసీ (tmc) భావిస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే ఈ తీర్మానాన్ని శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించుకోవాల‌ని యోచిస్తోంది. 

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌పై జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar)పై అభిశంస‌న తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని అధికారిక టీఎంసీ (tmc) భావిస్తోంది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనే ఈ తీర్మానాన్ని శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించుకోవాల‌ని యోచిస్తోంది. ఈ విష‌యంలో తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు మీడియాతో మాట్లాడారు. గవర్నర్ అసెంబ్లీని, స్పీకర్‌ను అవమానిస్తున్న తీరు కారణంగానే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తోంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే పార్టీ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పారు. “గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఆయన అసెంబ్లీని, స్పీకర్‌ను అవమానించిన తీరు బెంగాల్ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ జ‌ర‌గ‌లేదు. అయితే అలాంటి తీర్మానం సాధ్యమేనా అనే విష‌యంలో రాజ్యాంగ నిపుణులతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం’’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే ఓ మీడియా సంస్థ‌తో తెలిపారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ గా జగ్‌దీప్ ధన్‌ఖర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికార పార్టీకి ఆయ‌న‌కు విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ దన్ ఖ‌ర్.. సీఎం (CM), స్పీక‌ర్ (speaker)  ను ప‌లు విష‌యాల‌పై స‌మాచారాన్ని కోరారు. అయితే వాటిని అందించ‌కుండా రాజ్యంగ నిబంధ‌న‌లను అతిక్ర‌మించార‌ని గ‌వ‌ర్న‌ర్ ఆరోపించారు. 

ఈ విష‌యంలో TMC డిప్యూటీ చీఫ్ విప్ తపస్ రే (thapas re) మాట్లాడారు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేద‌ని తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ అభిశంస‌న తీర్మాణం విష‌యంలోనూ ఇంకా ఓ స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు.  అయితే రాష్ట్రం ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల విష‌యంలో గ‌వర్న‌ర్ జోక్యం ఆమోదయోగ్యంగా లేద‌ని అన్నారు. ప‌శ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ స్పీకర్‌ను ఇంతగా అవమానించలేద‌ని చెప్పారు. గవర్నర్ వ్యవహారశైలిని ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. 

ఈ పరిణామంపై ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మాట్లాడారు. TMC గ‌వ‌ర్న‌ర్ పై అభిశంస‌న తీర్మాణాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తే.. ఆ చ‌ర్యను త‌మ పార్టీ వ్య‌తిరేకిస్తుంద‌ని తెలిపారు. “గవర్నర్‌పై అధికార పార్టీ అలాంటి తీర్మానం తీసుకురావాలని భావిస్తే, మేము దానిని పూర్తిగా వ్యతిరేకిస్తాము. గ‌వర్న‌ర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిత్యం అవమానాలు ఎదుర్కొంటున్నారు’’ అని ఆయన చెప్పారు. 

ఈ నెల 25వ తేదీన అసెంబ్లీ ఆవరణలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్‌ (dr. br ambedhkar)  విగ్రహానికి గ‌వ‌ర్న‌ర్ పూల మాలలు వేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి భయానకంగా, దారుణంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు. దీంతో వివాదం మొద‌లైంది. 

click me!