TMC Jago Bangla: జాగో బంగ్లా..  అబే హత్యను అగ్నిపథ్ స్కీమ్ కు లింక్..

Published : Jul 10, 2022, 03:58 AM IST
TMC Jago Bangla: జాగో బంగ్లా..  అబే హత్యను అగ్నిపథ్ స్కీమ్ కు లింక్..

సారాంశం

TMC Jago Bangla: జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబె హత్యకు, కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిపథ్‌ పథకానికి ముడిపెడుతూ.. టిఎంసి అధికారిక ప్ర‌తిక జాగో బంగ్లాలో ప్రచురించింది. ఈ కథనంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. 

TMC Jago Bangla: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె హత్య నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఓ సంచలన కథనాన్ని ప్ర‌చురించింది. షింజో అబె హత్యకు, కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిపథ్‌ పథకానికి ముడిపెడుతూ..ఓ వివాదాస్ప‌ద క‌థనాన్ని ప్రచురించింది. జాగో బంగ్లా త‌న ప్ర‌త్యేక కథనంలో షింజో అబేను హత్య చేసిన వ్య‌క్తి  జ‌పాన్ నేవీలో మూడేండ్లు ప‌నిచేసి రిటైర‌య్యాడ‌నీ, ఆ త‌రువాత అత‌నికి ఆ దేశ ప్ర‌భుత్వం ఉపాధిని క‌ల్పించ‌డం గానీ, పింఛను ఇవ్వ‌డం గానీ  చేయలేద‌ని పేర్కొంది.

ఎక్కడా ఉద్యోగం రాక‌పోవ‌డంతో మాజీ ప్ర‌ధానిపై ఆగ్ర‌హం పెంచుకుని హంత‌మార్చ‌డ‌ని పేర్కొన్నది. ఇటీవ‌ల కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిపథ్ ప‌థ‌కం, జపనీస్‌ మారిటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్ రిక్యూట్ మెంట్ ఒకేలా ఉన్నాయని..  ఇక యువ‌త కూడా ఆగ్ర‌హంతో ఊగిపోతుంద‌ని పరోక్షంగా ప్ర‌ధానిని, కేంద్ర‌ప్రభుత్వాన్ని హెచ్చ‌రించింది. మోదీ ప్ర‌భుత్వం కూడా కాంట్రాక్టు పద్ధతిలో.. సైన్యంలో  యువతను నియమించుకునేందుకు అగ్నిపథ్ ప‌థ‌కాన్ని రూపొందించింది. ఆ తర్వాత పెన్షన్‌, ఇతర ప్ర‌యోజానాలు ఉండవని వ్యాఖ్యలు చేసింది. 

ఈ క‌థ‌నంపై కాంగ్రెస్‌ నేత సురేంద్ర రాజ్‌పుత్‌ మీడియాతో మాట్లాడుతూ.. అబెపై దాడి చేయడానికి యమగామికి గల ప్రేరణను అగ్నిపథ్‌తో పోల్చారు. జపాన్ ఆర్మీలో రిటైర్డ్‌ అయిన తర్వాత వన్‌టైమ్‌ పేమెంట్‌ పొందుతారు. ఆ తర్వాత వారికి ఎటువంటి రెగ్యులర్‌ పెన్షన్‌ స్కీమ్‌ లేదని అన్నారు.

టీఎంసీపై బీజేపీ ఆగ్ర‌హం

టిఎంసి మౌత్ పీస్ 'జాగో బంగ్లా'లో ప్రచురితమైన కథనంతో రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయి. జాగో బంగ్లాలో ప్రచురితమైన కథనంపై బీజేపీ నేత శిశిర్ బజేరా టీఎంసీపై మండిపడ్డారు. దేశం శోక సంద్రంలో మునిగిపోయిన స‌మ‌యంలో ఈ క‌థనాన్ని చదివి బెంగాలీలందరూ సిగ్గుతో తల దించుకున్నారని  అన్నారు.

తొలుత ఓ మత సంస్థకు చెందిన నాయ‌కుడ్ని చంపాలనుకున్నానని, ఈ క్ర‌మంలో ఆ మత‌ సంస్థ‌ తనకు తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాయి.. ఈ క్ర‌మంలోనే ..ఆ సంస్థకు షింజే అబెతో సంబంధాలు ఉన్నట్టు తెలిసింద‌నీ, ఈ నేప‌థ్యంలోనే  మాజీ ప్ర‌ధానిని హ‌తమొందించాన‌ని తెలిపారు. అయితే..  హ‌త్య ఎవ్వ‌రిని చేయాల‌నుకున్నార‌నే వివరాలు తెలియలేదు. హంత‌కుడు కొంతకాలం నేవీలో పనిచేశాడని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన హంత‌కుడు.. రెండు నెలల కిందట మరో ఉద్యోగం మానేశాడని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్