చెన్నైలో టిటిడి రెండవ ఆలయం : 17న ప్రారంభోత్సవం..

Published : Mar 13, 2023, 01:07 PM IST
చెన్నైలో టిటిడి రెండవ ఆలయం : 17న ప్రారంభోత్సవం..

సారాంశం

చెన్నైలో టీటీడీ రెండో ఆలయం ఈ నెల 17వ తేదీన భక్తులకు అందుబాటులోకి రానుంది. ప్రారంభోత్సవానికి అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీ అయ్యింది. 

చెన్నై : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద, ధనిక హిందూ దేవాలయం. చెన్నైలో టీటీడీ రెండో దేవాలయం మార్చి 17 న ప్రారంభానికి ముస్తాబవుతోంది. పద్మావతీ అమ్మవారికి అంకితం చేసిన ఈ కొత్త ఆలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 

చెన్నైలోని టీటీడీ రెండో ఆలయాన్ని మార్చి 17న భక్తులకు పూజల కోసం అంకితం చేయనున్నారు. ఈ ఆలయం చెన్నైలోని టి నగర్‌లో ఉంది. చెన్నై, టి నగర్‌లోని జిఎన్‌ చెట్టి రోడ్డులో స్థాపించబడిన తిరుమల తిరుపతి దేవస్థానాకికి చెందిన రెండవ ఆలయం ఇది. ఇది టీ నగర్ వద్ద వెంకటనారాయణ రోడ్డులో ఉన్న మొదటి టీటీడీకి చాలా దగ్గరలో ఉంది.

అయితే, ఈ దేవాలయంలో ఆదివారం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిఎన్‌చెట్టి రోడ్డులోని కొత్త టిటిడి ఆలయంలో అంకురార్పణంతో ప్రారంభమయ్యే ధార్మిక ఆచారాల పరంపరను ఆదివారం నుంచి నిర్వహించనున్నట్లు టిటిడిఎస్ చెన్నై స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు, టిటిడి ట్రస్ట్‌కు ప్రత్యేక ఆహ్వానితులు ఎజె శేఖర్ రెడ్డి విలేకరులతో తెలిపారు.

ఈ పూజల్లో అతి ముఖ్యమైన ఘట్టమైన మహాకుంభాబిషేకం మార్చి 17న జరుగుతుంది. మార్చి 17న టీ నగర్ లోని జీఎన్ చెట్టి రోడ్ లో ఉన్న పద్మావతి అమ్మవారి దేవాలయంలో జరిగే ఈ మహాకుంబాభిషేకానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని.. చెన్నై ఎల్ఏసి ప్రెసిడెంట్ భక్తులకు పిలుపునిచ్చారు. 

ఈ దేవాలయం రాజగోపురం నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఈ నిధులను ఏజే శేఖర్ రెడ్డి డొనేట్ చేశారు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu