విడిపోయిన ఐఎఎస్ టాపర్ జంట...టీనాదబీ, అథర్‌ఖాన్‌లకు విడాకులు మంజూరు...

Published : Aug 11, 2021, 01:40 PM IST
విడిపోయిన ఐఎఎస్ టాపర్ జంట...టీనాదబీ, అథర్‌ఖాన్‌లకు విడాకులు మంజూరు...

సారాంశం

అయితే రెండేళ్లకే వీరిమధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది నవంబర్ లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు విడాకులు మజూరయ్యాయి. 

ఐఏఎస్ టాపర్స్ జంట టీనా దాబి, అధర్ అమిర్ ఖాన్ విడిపోయారు. రాజస్థాన్ లోని జైపూర్ లో గల ఫ్యామిలీ కోర్టు వీరికి తాజాగా విడాకులు మంజూరు చేసింది. ఐఏఎస్ పరీక్షలో ఒకటి, రెండు ర్ాయంకులు సాధించిన వీరిద్దదూ 2018లో వివాహబంధంతో ఒక్కటై వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే రెండేళ్లకే వీరిమధ్య మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గతేడాది నవంబర్ లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు విడాకులు మజూరయ్యాయి. 2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో టీనా దాబి మొదటి ర్యాంకు సాధించగా.. అధర్ రెండో ర్యాంకులో నిలిచారు.

అనంతరం శిక్షణ సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. అలా 2018లో ఏప్రిల్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంతులు, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu