కేరళలో మూడేళ్ల చిన్నారికి కరోనా : ఇండియాలో 41 మందికి వ్యాధి లక్షణాలు

By narsimha lodeFirst Published Mar 9, 2020, 1:45 PM IST
Highlights

కేరళ రాష్ట్రంలో మూడేళ్ల చిన్నారికి కరోనా వ్యాధి సోకింది.దీంతో కరోనా వ్యాధి పాజిటివ్ లక్షణాలు కలిగిన ఉన్నవారి సంఖ్య 41కు చేరింది. 
కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన  ఓ కుటుంబం ఇటలీకి వెళ్లింది. ఈ కుటుంబం ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇటలీ నుండి స్వదేశానికి తిరిగి వచ్చింది. 

తిరువనంతపురం:కేరళ రాష్ట్రంలో మూడేళ్ల చిన్నారికి కరోనా వ్యాధి సోకింది.దీంతో కరోనా వ్యాధి పాజిటివ్ లక్షణాలు కలిగిన ఉన్నవారి సంఖ్య 41కు చేరింది. 
కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన  ఓ కుటుంబం ఇటలీకి వెళ్లింది. ఈ కుటుంబం ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఇటలీ నుండి స్వదేశానికి తిరిగి వచ్చింది. 

స్వదేశానికి వచ్చిన సమయంలో  ఎయిర్‌పోర్టులో వైద్యాధికారులు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.  ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో   మూడేళ్ల చిన్నారికి  కరోనా పాజిటివ్  లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు.  

ఈ ముగ్గురి రక్తనమూనాలను  కేరళకు చెందిన వ్యైద్య శాఖాధికారులు సేకరించారు. మూడేళ్ల చిన్నారికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు.  దీంతో  ఆ చిన్నారిని తల్లిదండ్రులకు దూరంగా ఉంచారు. ఎర్నాకుళం మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఆ చిన్నారిని ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.సోమవారం నాడు ఉదయానికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారి సంఖ్య దేశంలో 41కు చేరుకొంది. 
 

click me!