వర్షాలతో పవర్‌కట్, ఐసీయూలో ముగ్గురు మృతి

By Siva KodatiFirst Published May 8, 2019, 2:02 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎంతటి విధ్వంసం జరిగిందో మనకు తెలిసిందే.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎంతటి విధ్వంసం జరిగిందో మనకు తెలిసిందే. తాజాగా తమిళనాడులో వర్షాల కారణంగా ముగ్గురు రోగులు మరణించారు.

వివరాల్లోకి వెళితే.. మధురై పరిసర ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

అయితే ప్రభుత్వాసుపత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులు ఊపిరాడక మరణించగా, మరో ఏడుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం .  కాగా, ఈ ఘటనలో ఆస్పత్రి తప్పిదం ఏం లేదని డీన్ చెబుతున్నారు. మరణించిన వారిని మల్లిక, రవిచంద్రన్‌గా గుర్తించారు. 

click me!