గజ తుఫాన్ ఎఫెక్ట్: తిరువారూర్ ఉప ఎన్నిక రద్దు

By sivanagaprasad kodatiFirst Published Jan 7, 2019, 10:00 AM IST
Highlights

తమిళనాడులోని తిరువారూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతితో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువారూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది

తమిళనాడులోని తిరువారూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతితో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న తిరువారూర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే ఇటీవల తమిళనాడులో సంభవించిందని గజ తుఫాను కారణంగా భారీ ఆస్తి, ప్రాణనష్టం చోటు చేసుకుంది. తుఫాను బాధితులకు అందాల్సిన నష్టపరిహారం ఇంకా పూర్తిగా అందలేదని, అందువల్ల ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉప ఎన్నిక వాయిదా వేయ్యాలని పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి.

దీనిని పరిగణలోనికి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరువారూర్ నియోజకవర్గం నుంచి ఐదు దశాబ్ధాలుగా ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన కరుణానిధి గతేడాది ఆగస్టు 7న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

click me!