తల్లిని నరికి రక్తం తాగిన కొడుకు

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 09:21 AM IST
తల్లిని నరికి రక్తం తాగిన కొడుకు

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ కొడుకు తల్లిని అత్యంత కిరాతకంగా నరికి అనంతరం ఆమె రక్తాన్ని తాగేశాడు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా రామకచ్చర్ గ్రామంలో దిలీప్ కుమార్ అనే వ్యక్తికి క్షుద్రపూజలు, అతీంద్రియ శక్తుల మీద నమ్మకం ఎక్కువ.

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. ఓ కొడుకు తల్లిని అత్యంత కిరాతకంగా నరికి అనంతరం ఆమె రక్తాన్ని తాగేశాడు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా రామకచ్చర్ గ్రామంలో దిలీప్ కుమార్ అనే వ్యక్తికి క్షుద్రపూజలు, అతీంద్రియ శక్తుల మీద నమ్మకం ఎక్కువ.

ఈ పిచ్చితో తరచుగా ఏవో క్షుద్రపూజలు చదువుతూ వాటి కోసం తాంత్రిక పూజలు చేసేవాడు. ఈ క్రమంలో ఓ పుస్తకం చదువుతుండగా అతీంద్రియ శక్తులు పొందాలంటే.. తల్లిని చంపి, ఆమె రక్తం తాగాలని రాసి ఉండటం చూశాడు.  

అంతే అప్పటికప్పుడు తన తల్లి సుమేరియాని గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అనంతరం ఆమె గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని గ్లాసులోకి తీసుకుని తాగాడు. తర్వాత తల్లి శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పడేశాడు.

నాలుగు రోజుల తర్వాత దిలీప్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటం గమనించిన సుమేరియా స్నేహితురాలు సమీరన్ యాదవ్ ఈ దారుణాన్ని చూసి షాక్‌కు గురైంది. భయంతో వణికిపోతూ, పరుగు పరుగున తన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు, తర్వాత గ్రామపెద్దలకు చెప్పింది.

పోలీసులకు సమాచారం అందించి సుమేరియా ఇంటికి వెళ్లి చూడగా.. దీలిప్ క్షుద్రదేవతల ఫోటోల ముందు తల్లి శరీరంలోని కొన్ని భాగటాలను పెట్టి పూజ చేస్తూ కనిపించాడు. గ్రామస్తులను చూసిన వెంటనే భయపడిన అతడు అక్కడి నుంచి పారిపోయాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దిలీప్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu