దొంగతనానికి న్యూస్ పేపర్ టెక్నిక్.. ఎవరూ తీయకుంటే చోరీ.. యూపీలో కొత్త తరహా దోపిడీ

By Mahesh KFirst Published Nov 3, 2022, 3:51 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కొందరు దుండగులు న్యూస్ పేపర్ ను యూజ్ చేసుకుని దొంగతనం చేశారు. ముందు ఆ ఇంటిలోకి న్యూస్ పేపర్ విసిరేసి.. కొంత కాలం వెయిట్ చేసి అసలు ఆ ఇంటిలో ఎవరైనా ఉన్నారా? లేక ఖాళీగా ఉన్నదా? అనే విషయాన్ని నిర్దారించుకుని చోరీ చేసినట్టు తెలుస్తున్నది.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘరానా దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతనానికి న్యూస్ పేపర్‌ను వినియోగించుకోవడమే చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నది. సాధారణంగా ఇంటిలో ఎవరూ లేరంటే ఆ ఇంటికి తాళం వేసి కనిపిస్తుంది. కానీ, ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కారణంగా తాళాలను నమ్ముకునేలా లేదు. దీంతో కొత్త తరహా మోసానికి తెర తీశారు. వారు ఎంచుకున్న ఇంటిలో ఎవరూ లేరనే నిర్దారణకు రావడానికి.. ఆ ఇంటి ముందు ఒక న్యూస్ పేపర్ వేస్తారు. ఆ తర్వాత ఆ న్యూస్ పేపర్ ఎవరైనా తీశారా? లేదా? అని ఎదురుచూసి ఓ నిర్దారణకు వస్తారు. న్యూస్ పేపర్ ఎవరైనా ఆ ఇంట్లో జనాలు ఉన్నట్టుగా అంచనాకు వస్తారు. ఎలా విసిరిన పేపర్ అలాగే ఉన్నదంటే.. వారు ఇంటిలో నివసించడం లేదనే నిర్దారణకు వచ్చి సమయం పెట్టుకుని ఆ ఇంటిని గుల్ల చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అవంతిక ఫేజ్ 2లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అవంతిక ఫేజ్ 2లో అవంతికలో బాధితులు నివసిస్తున్నారు. ఆ కుటుంబంలో ఒక పెద్దాయన, ఆయన భార్య, కూతురు ఉన్నారు. వారు వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి స్వగృహానికి వచ్చారు. వారు అక్టోబర్ 29వ తేదీన ఇల్లు వదిలి ఈ ట్రిప్‌కు వెళ్లారు. వారు తిరిగి రాగానే ఇంటిలో దొంగలు పడ్డట్టు గమనించారు. బంగారు, వెండి నగలు, నగదు చోరీకి గురయ్యాయని గుర్తించారు.

Also Read: అడవిలో మహిళ మృతదేహం.. చంపేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేసీ..

ఆ ఇంటి పెద్ద రవీంద్ర కుమార్ బన్సల్ మాట్లాడుతూ, ట్రిప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తమ ఇంటి మెయిన్ డోర్ తీసే ఉన్నదని తెలిపారు. ముందు ఉన్న మెష్ డోర్ కూడా కొంత ఓపెన్ చేసి ఉందని వివరించారు. వారి ఇంటి ముందు ఓ న్యూస్ పేపర్ పడి ఉన్నదని తెలిపారు. తమ ఇంటి గదుల్లో అంతా వస్తువులతో గందరగోళంగా మార్చేశారని, బంగారం, వెండి నగలు, నగదు మొత్తం కలిపి సుమారు రూ. 10 లక్షల వరకు వారు దొంగిలించినట్టు అంచనా వేశారు.

అయితే, ఆ కుటుంబం ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనిపెట్టింది. వారు ఎలాంటి న్యూస్ పేపర్‌నూ సబ్‌స్క్రైబ్ చేసుకోలేదు. కానీ, ఒక పేపర్ మాత్రం తమ ఇంటి ప్రాంగణంలో కనిపించింది. అంటే.. వారి ఇంటిలో ఎవరైనా ఉన్నారా? లేరా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి న్యూస్ పేపర్ ను వినియోగించారని అర్థం చేసుకున్నారు.

ఆ న్యూస్ పేపర్ అక్టోబర్ 29వ తేదీది.. కొన్ని రోజుల నుంచి ఆ పేపర్ అలాగే పడి ఉన్నదని గమనించారు. ఇంటికి పెట్టిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. ఆ ఘటన రాత్రి పూట జరిగి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. కవి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!