ఐదు రూపాయలు దొంగతనం చేసినందుకు ఐదేళ్ల జైలు శిక్ష

By Arun Kumar PFirst Published Aug 10, 2018, 4:26 PM IST
Highlights

ఐదు రూపాయలు దొంగతనం చేసిన పాపానికి ఐదుగురు నిందితులకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ విచిత్ర సంఘటన దేశ రాజధాని న్యూడిల్లీ లో చోటుచేసుకుంది. కేవలం ఐదు రూపాయల దొంగతనానికే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఐదు రూపాయలు దొంగతనం చేసిన పాపానికి ఐదుగురు నిందితులకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ విచిత్ర సంఘటన దేశ రాజధాని న్యూడిల్లీ లో చోటుచేసుకుంది. కేవలం ఐదు రూపాయల దొంగతనానికే ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

డిల్లీలో ఓ 43ఏళ్ల వ్యాపారి వస్త్రాల తయారీకి ఉపయోగపడే ముడిసరుకు తయారుచేసి, సరఫరా చేసే వ్యాపారం చేస్తుంటాడు. ఇతడి వద్ద ఇప్తెకార్ ఖలీద్ అను వ్యక్తి ముడిసరుకును కొంటుండేవాడు. అయితే వ్యాపారి నిత్యం తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులను  బ్యాగులో పెట్టుకుని ప్రయాణించడాన్ని ఖలీద్ గమనించాడు. దీంతో అతడిలోని దొంగ మేల్కొన్నాడు. ఎలాగైనా వ్యాపారి వద్ద నుండి ఆ బ్యాగును కొట్టేయాలనుకున్నాడు.

ఈ దొపిడీ కోసం మరో నలుగురు మిత్రులతో పథకం రచించాడు. ఓ రోజు వ్యాపారి తన ఇంటికి స్కూటర్ పై వెళుతుండగా ఖలీద్ గ్యాంగ్ ముసుగులు ధరించి వచ్చి వ్యాపారిని అడ్డుకున్నారు. అతడిని గన్ తో బెదిరించి,కళ్లలో కారం చల్లి బ్యాగుతో పాటు స్కూటర్ ని తీసుకుని పరారయ్యారు. అయితే ఆ బ్యాగులోని డబ్బులను చూసి ఖలీద్ గ్యాంగ్ అవాక్కయ్యారు. బ్యాగులో లక్షల్లో డబ్బులుంటాయని భావించి దొంగతనానికి పాల్పడితే అందులో మాత్రం అక్షరాల ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి. 

ఈ దొంగతనంపై వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా నేరం నిరూపణ అయ్యింది. దీంతో వారికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  


 

click me!