
రోజురోజుకు మానవ జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ అన్నింటిలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులతో మనిషి రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా..హర్ట్ ఏటాక్ బారినపడటం, హఠాత్తుగా కుప్పకూలిపోయారు. మంచి ఆహారపు అలవాటు, సరైనా జీవన విధానం అనుసరించే..సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ కేవలం 40 ఏళ్ల కే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఈ క్రమంలో ఇలాంటి ఘటనలకు అనేక దిగ్భ్రాంతికరమైన కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి సంఘటనలపై నిపుణులను కూడా ఆందోళన గురిచేస్తున్నారు. రోజురోజుకు ఆకస్మిక గుండె పోటు మరణాల సంఘటనలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
తాజాగా శుక్రవారం నాడు హైదరాబాద్ లో రెండు హార్ట్ ఎటాక్ సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో 24 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఆకస్మికంగా కుప్పకూలి మరణించాడు. మరొక ఘటనలో 40 ఏళ్ల వ్యక్తి ఓ 'హల్దీ' వేడుకలో ఆకస్మికంగా కుప్పకూలడం వంటి ఘటనలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు నివేదించబడ్డాయి. ఈ తరుణంలో #heartattack అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది.ఈ సంఘటనలు పెరుగుతుండటంతో యువత సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెందుతోంది.
ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌లో ఓ చిన్న క్లిప్ చక్కర్లు కొడుతోంది. ఆ క్లిప్‌లో.. చైనాలోని ఒక వైద్యుడు థియేటర్‌లో గుండెపోటుతో బాధపడుతున్న యువతికి సహాయం చేస్తున్నాడు. వైద్యుల వల్ల మహిళ రెండు నిమిషాల తర్వాత కోలుకుంటున్నట్లు వీడియో కనిపిస్తుంది. అయితే.. అలాంటి సమయంలో అలాంటి ట్రికులు పని చేయవని వైద్యులు పేర్కొంటున్నారు.
నగరంలోని సైబరాబాద్ ప్రాంతంలో గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాలను ఓ పోలీసు ఎలా కాపాడాడో హైదరాబాద్‌లోని ఇలాంటి మరో ఫుటేజ్ చూపిస్తుంది. రాజశేఖర్ అనే పోలీసు అధికారి సీపీఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
కొన్ని వారాల క్రితం.. మరొక వైరల్ వీడియో నవీ ముంబైలో ఒక ఆటోరిక్షా డ్రైవర్ రైడ్ సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలినట్లు చూపించింది. మరో ఆటోడ్రైవర్ సీపీఆర్ ఇచ్చి అతడిని బతికించేందుకు ప్రయత్నించాడు.కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తానికి హార్ట్ ఎటాక్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున, ఒక వ్యక్తి అటువంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా ఆరోగ్య నిపుణులు సలహా తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి .. హార్ట్ ఎటాక్ పై అవగాహన కల్పిస్తూ పోస్టు చేస్తున్న ఓ వీడియో ట్విట్టర్ లో వైరలవుతోంది. "ఏదో ఒక పొజిషన్‌లో కూర్చోవడం, అల్లం వెల్లుల్లి, ధనియా , మిర్చ్ నమలడం, దగ్గుతూ నవ్వడం. ఇవేవీ హర్ట్ ఏటాక్ తగ్గడానికి సహాయపడవు. వీలైనంత త్వరగా గుండె సంబంధిత సదుపాయం ఉన్న ఆసుపత్రికి తరలించి #Heartattack కు గురైన వ్యక్తికి తగిన చికిత్స అందించి ప్రాణాలు కాపాడుకోండి," అని పేర్కొన్నారు.
అదే సమయంలో నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (NCBI) కూడా సంచలన వాస్తవాలను వెలుగులోకి తీసుకవచ్చింది. దీని నివేదిక ప్రకారం.. భారతదేశంలో సంభవించే మరణాలలో ఐదు శాతం యువ జనాభా గుండెపోటు, కార్డియక్ అరెస్ట్ , స్ట్రోక్‌ల వల్ల చనిపోతున్నారని తెలిపింది. కొన్ని నివేదికలు దీనిని కాలుష్యంతో కూడా ముడిపెట్టాయి, అయితే వైద్యులు అనేక కారణాలు ఉన్నాయని , అవన్నీ కాలుష్యం ద్వారా లెక్కించబడవని చెప్పారు.
ప్రపంచంలోని ప్రముఖ కార్డియాక్ సర్జన్ , ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమాకాంత పాండా ఇలా వివరిస్తున్నారు.. "యువతలో ఆకస్మిక మరణం చాలా సాధారణమన్నారు. ఛాతీలో అసౌకర్యం/ఊపిరి ఆడకపోవడం, గుండె సమస్యల సంభావ్యతను సూచిస్తుందని, కారణాన్ని నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు అవసరమని ఆయన సలహా ఇస్తున్నారు. యువకులలో గుండె సమస్యలకు ఇతర సాధారణ కారణాలు గుండె జబ్బుల కుటుంబ చరిత్ర, మధుమేహం , రక్తపోటు వంటి వైద్య పరిస్థితులు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, అలాగే తగు వ్యాయామం లేకపోవడం వల్ల రావొచ్చని పేర్కొన్నారు.