ఒక భార్య - ఇద్దరు భర్తలు : ఆమె కోసం మొదటి భర్తను కిడ్నాప్ చేసిన రెండో భర్త, హత్యాయత్నం.. అరెస్ట్...

By Bukka SumabalaFirst Published Sep 3, 2022, 8:05 AM IST
Highlights

ఒకరిని పెళ్లి చేసుకున్న మహిళ.. రెండు నెలలకే మరో వ్యక్తిని వివాహం ఆడింది. దీంతో ఇద్దరు భర్తలు గొడవకు దిగారు. చివరికి రెండో భర్త మొదటి భర్తను కిడ్నాప్ చేసి, హత్య చేయడానికి ప్రయత్నించాడు. 

కర్ణాటక :  తన భార్య మొదటి భర్తను కిడ్నాప్ చేసి.. హత్య చేసేందుకు ప్రయత్నించిన ప్రకాష్ అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి కర్నూలుకు వచ్చి ఉంటున్న మంజుళ అనే యువతిని మోహన్ రామ్ అనే వ్యక్తి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఆ ఇద్దరూ కడూరులోనే ఉంటున్నారు. వివాహమైన రెండు నెలల అనంతరం ఆ దంపతులు రాజస్థాన్ కి వెళ్లారు.  మంజుళ మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు.  తర్వాత వస్తుందన్న నమ్మకంతో ఉపాధికోసం మోహన్ రామ్ తిరిగి కడూరు చేరుకున్నాడు. 

ఆ తరువాత భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమెను తీసుకు వచ్చేందుకు మోహన్ రామ్ రాజస్థాన్ కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన అతనికి షాకింగ్ విషయం తెలిసింది. తన భార్య  హర్యానాలోని పిప్లివాలా గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ అనే యువకుడిని వివాహం చేసుకొని బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకుని కంగుతిన్నాడు. తన నుంచి విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండో వివాహం చెల్లదంటూ భార్యకు ఫోన్ లో మెసేజ్ పెట్టాడు. అయితే ఆమెకు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా నిన్ను చంపేస్తా అని మోహన్ రామ్ ను ఓంప్రకాష్ హెచ్చరించాడు. అయినా, మోహన్ రామ్ పట్టువిడవకుండా ఆమెకు మెసేజ్లు పంపిస్తుంటే ఓం ప్రకాష్ తన స్నేహితులను వెంటబెట్టుకుని కారులో కడూరుకు వచ్చాడు.

మద్యంమత్తులో.. గర్భిణీ భార్యను నరికి, తానూ నరుక్కుని.. ఓ భర్త ఘాతుకం..

నిత్యావసరాలను కొనుగోలు చేసుకుంటున్న మోహన్ రామ్ ను వెంబడించి  కిడ్నాప్ చేశాడు. కారులోనే కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించాడు.  బాధితుడి కేకలు విన్న స్థానికులు చుట్టుముట్టడంతో కారు వేగం పెంచారు.  కొంత దూరం వెళ్లేసరికి కారు ముందుకు కదలకుండా మొరాయించడంతో వీరంతా దొరికిపోయారు. సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన పోలీసులు ఓం ప్రకాశ్, శైలేంద్ర, ప్రదీప్, దల్లారామ్, జితేంద్ర, శంకర్ పాటిల్, దినేష్  అనే నిందితులను అరెస్టు చేశారు. కారును, హత్య చేసేందుకు  తనతో తెచ్చుకున్న వికెట్లను స్వాధీనపరచుకుని దర్యాప్తు చేపట్టారు.

click me!