‘‘అయోధ్య’’ కోట్లాది మంది నమ్మకం.. పురాణాలు, వాస్తవికత‌పై ప్రత్యేక కథనం.. (వీడియో)

Published : May 28, 2023, 11:18 PM IST
‘‘అయోధ్య’’ కోట్లాది మంది నమ్మకం.. పురాణాలు, వాస్తవికత‌పై ప్రత్యేక కథనం.. (వీడియో)

సారాంశం

అయోధ్య నగరాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారనే సంగతి తెలిసిందే.  అయోధ్యను రాముడి జన్మస్థలంగా చాలా  మంది నమ్ముతారు. 

అయోధ్య నగరాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారనే సంగతి తెలిసిందే.  అయోధ్యను రాముడి జన్మస్థలంగా కోట్లాది మంది నమ్ముతారు. త్రేతాయుగంలో సరయూ నదీ తీరంలో రాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ నమ్మకాలకు చారిత్రక ఆధారాలు తక్కువ. అయితే అయోధ్యలో వివాదస్పద స్థలానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, మత, న్యాయపరమైన వివాదాలు వందేళ్లకు పైగా భారతదేశాన్ని కుదిపేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అయోధ్య కొంత కీర్తిని  కోల్పోయింది. అయితే 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు రామ మందిరం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. అయోధ్య చరిత్రలో సరికొత్త అధ్యాయనం మొదలైంది. వివాదస్థలం రామ్ లల్లాకు చెందుతుందని సుప్రీం కోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు వెలువరించింది. దీంతో అక్కడ రామమందిర నిర్మాణ  పనులు సాగుతున్నాయి. 

దీంతో అయోధ్యను శ్రీరాముని జన్మస్థలంగా భావిస్తున్న హిందువులు.. అక్కడ భవ్యమైన రామమందిరంతో తమ కల సాకారం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అయోధ్య గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి.. వాస్తవికత ఎలా ఉందో తెలుసుకుందాం. మహాజనపదాలలో కూడా అయోధ్య గురించి ప్రస్తావన ఉంది. అయోధ్యను పురాణాలలో సాకేత్ అని పిలిచేవారు. 

అయోధ్య శ్రీరాముడు నడయాడిన నేలగా హిందువులకు పవిత్ర క్షేత్రంగా ఉంది. అలాగే హిందూ మతంతోపాటు ఇతర సంప్రదాయాలైన జైన, బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉంది. ఎందుకంటే.. బౌద్ధ మత చరిత్ర ప్రకారం బుద్దుడు సాకేత్‌లో 16 ఏళ్ల వరకూ నివసించారు. అలాగే.. జైనుల మొట్టమొదటి తీర్థంకరుడైన ఆదినాథ్‌తో పాటు మరో నలుగురు తీర్థంకరులు అయోధ్యలోనే జన్మించారని చెబుతారు.

ఐదో శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన చైనీస్ బౌద్ధ సన్యాసి ఫా హియన్ అయోధ్యలో పెద్ద నిర్మాణాలు ఏమి లేవని చెప్పారు. అయితే ఆ తర్వాత రెండు శతాబ్దాలకు అంటే ఏడో శతాబ్దంలో చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ అక్కడ ఆలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక, డచ్ ఇండాలజిస్ట్, చరిత్రకారుడు హన్స్ టి బక్కర్ కూడా.. అయోధ్యకు మరో పేరే సాకేత్ అని చెప్పారు. ప్రాచీన భారతదేశంలో సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రం ఈ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. అయోధ్య చరిత్రపై తన అధ్యయనంలో ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రస్తావించారు. 

అయితే పలు సామ్రాజ్యాలు అయోధ్యను వారి రాజధానిగా చేసుకన్నాయి. అయితే గుప్తుల తర్వాత 5 శతాబ్దాల పాటు అయోధ్యలో నిశ్శబ్దం చోటుచేసుకుంది. ఇక, ఢిల్లీ సుల్తాన్‌లు పాలనలో అయోధ్యలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాసనాల ప్రకారం.. మొఘల్ చక్రవర్తి బాబర్ అక్కడ మసీదు నిర్మించారు. ఆ ప్రాంతమే వివాదస్పద భూమిగా  పేర్కొనబడింది. 

ఇక, పురావస్తు, సాధారణ దృక్పథం ఆధారంగా అయోధ్యకు రెండు రకాల చరిత్ర ఉందని పురావస్తు శాస్త్రవేత్త కేకే ముహమ్మద్ చెబుతున్నారు. పురావస్తు పరిశోధనలు విశ్వసనీయమైనవి అని పేర్కొన్నారు. తమ త్రవ్వకాల ప్రకారం ఈ భూమి కాలం 1200 BC నుంచి కొనసాగుతుందని.. అయోధ్యలోని ఇతర భూములను తవ్వితే, మనకు మరిన్ని పురాతన ఆధారాలు లభిస్తాయని  చెప్పారు. రామాయణం ప్రకారం అయోధ్యలో విశాలమైన పట్టణ వీధులు, భవనాల వర్ణనలు ఉన్నాయని.. కానీ తమ పురావస్తు పరిశోధనలు ఈ ప్రదేశం నుండి అటువంటి ఆధారాలు ఏవీ కనుగొనలేకపోయాయని చెప్పారు. ఈ వివరాలను నిర్ధారించడానికి తాము త్రవ్వకాల ప్రాంతాన్ని విస్తరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

ఈ తవ్వకాలు కూడా అనేక దశలను కలిగి ఉన్నాయని కూడా చెప్పారు. మొదటిది బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఏకే నారాయణ్ మార్గదర్శకత్వంలో జరిగిందని తెలిపారు. రెండవది 1976-77లో ప్రొఫెసర్ బీబీ లాల్ ఆధ్వర్యంలో జరిగిందని.. ఆ తవ్వకాల సీరిస్‌లో తాను కూడా పాల్గొన్నానని గుర్తుచేసుకున్నారు. ఈ త్రవ్వకాలలో తాము మసీదు క్రింద ఆలయ స్తంభాలను కనుగొన్నామని వెల్లడించారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలుగా తమకు కొన్ని పరిమితులు ఉంటాయని.. ఆధారాలు ఉంటేనే ఏదైనా నమ్మాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఆ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది.. అది విష్ణు దేవాలయం అంతవరకు మాత్రమే తమ వాదనను పరిమితం చేస్తామని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. అయోధ్య  రామమందిర నిర్మాణం అద్భుతమైన హస్తకళ, భారీ ఇంజనీరింగ్‌కు చిహ్నంగా నిలవనుంది. 57,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంజనీర్లు, హస్తకళాకారులు రాముడి వైభవాన్ని, అయోధ్యకు దాని సహజమైన రూపానికి పునరుద్ధరించడాన్ని నిర్ధారించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. అయోధ్యలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న రామమందిరం ప్రారంభం తర్వాత  ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్