Ayodhya New Airport : అయోధ్యలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా? 

By Rajesh Karampoori  |  First Published Dec 28, 2023, 10:45 PM IST

Ayodhya New Airport: అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ గా నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (డిసెంబర్ 30) అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) వెల్లడించిన వివరాల ప్రకారం.. అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను రూ. 1,450 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేశారు. విమానాశ్రయ టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలను అందించడానికి సిద్ధంగా ఉంటుంది.


Ayodhya New Airport: శ్రీరాముడి నగరమైన అయోధ్యలోని నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి రామాయణ రచయిత మహర్షి వాల్మీకి పేరు పెట్టనున్నారు. పలు వార్త కథనాల ప్రకారం.. ఈ విమానాశ్రయం పేరు 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్' నామకరణం చేశారు. ఈ విమానాశ్రయాన్ని గతంలో ‘మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ అని పిలిచేవారు.

ఈ కొత్త విమానాశ్రయాన్ని డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ శనివారం నాడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారని సమాచారం. అలాగే.. ప్రధాని మోదీ తన అయోధ్య పర్యటన సందర్భంగా వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు.

Latest Videos

undefined

 ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) వెల్లడించిన వివరాల ప్రకారం..'ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించనున్నారు.పునర్ అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఉదయం 11.15 గంటలకు ప్రారంభిస్తారు. దీంతో పాటు అక్కడ కొత్త అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య ఎయిర్‌పోర్టును ప్రధాని ప్రారంభిస్తారు. దీని తర్వాత, రూ. 15,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేసే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.4600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. 

అయోధ్య విమానాశ్రయంలో సకల సౌకర్యాలు 

1,450 కోట్లకు పైగా వ్యయంతో అయోధ్యలోని అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశను అభివృద్ధి చేసినట్లు PMO ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త టెర్మినల్ భవనం 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ఏటా సుమారు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే విధంగా నిర్మించారు.  రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనం నిర్మించబడుతుందని, రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులు , ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
 
టెర్మినల్ భవనం.. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరామ మందిర నిర్మాణాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగంలో శ్రీ రాముడి జీవితాన్ని వర్ణించేలా పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో అలంకరించారు. అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, LED లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్ వంటి వివిధ సౌకర్యాలు ఉన్నాయి.

అయోధ్య రైల్వే స్టేషన్ కూడా అదుర్స్ 

అయోధ్య రైల్వే స్టేషన్ మొదటి దశను రూ.240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అని పిలువబడే 3 అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజా, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్, చైల్డ్ కేర్ రూమ్, వెయిటింగ్ హాల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు అయినా'అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్'ను ప్రధాన మంత్రి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు.  
 

click me!