దీన్‌దయాళ్ అంత్యోదయ పథకం : అందమైన పుల్వామాలో .. కలలు సాకారం చేసుకున్న ఇన్షా షబీర్

By Siva Kodati  |  First Published Dec 28, 2023, 7:13 PM IST

జమ్మూ & కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అందమైన లోయలో స్వాతంత్ర్యం, స్థితిస్థాపకత , పరివర్తనకు చిహ్నంగా మారిన ఒక యువతి నివసిస్తుంది. నిరాడంబరమైన కుటుంబంలో జన్మించిన ఆమె పుల్వామాలోని ఆరిగామ్‌లో ఇన్షా షబీర్ వ్యాపారిగా మారింది.


జమ్మూ & కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో అందమైన లోయలో స్వాతంత్ర్యం, స్థితిస్థాపకత , పరివర్తనకు చిహ్నంగా మారిన ఒక యువతి నివసిస్తుంది. నిరాడంబరమైన కుటుంబంలో జన్మించిన ఆమె పుల్వామాలోని ఆరిగామ్‌లో ఇన్షా షబీర్ వ్యాపారిగా మారింది. బోటిక్‌ని నిర్వహిస్తున్న ఆమె.. కేంద్ర ప్రభుత్వ దీన్ దయాళ్ లబ్ధిదారుల్లో ఒకరు. అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటివి ఇన్షా మాదిరిగా ఎంతోమంది ఆడపిల్లలకు ఆసరాగా నిలుస్తుంది. 

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్షా మాట్లాడుతూ.. దీనదయాళ్ అంత్యోదయ గురించి తెలుసుకున్నానని చెప్పారు. 2017లో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం నమోదు చేసుకున్నానని ఆమె వెల్లడించారు. 2011లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గ్రామీణ పేదల కోసం సమర్ధవంతమైన సంస్థాగత వేదికలను సృష్టించడం, స్థిరమైన జీవనోపాధి మెరుగుదలలు , ఆర్ధిక సేవలకు మెరుగైన గృహ ఆదాయాన్ని పెంచడం దీని లక్ష్యం. 

Latest Videos

తనకు చిన్నప్పటి నుంచి బట్టలు డిజైన్ చేయడం, తయారు చేయడం పట్ల ఆసక్తి వుందని ఇన్షా వెల్లడించారు. దీనదయాల్ అంత్యోదయ యోజన ఎన్ఆర్ఎల్ఎం కింద స్థానిక టైలరింగ్ పాఠశాలలో ఆమె టైలరింగ్ నేర్చుకున్నారు. ప్రతిభ, ఆసక్తితో దానిని వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో డిజైన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇన్షా బోటిక్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. అనంతరం పీఎంఈజీపీ ఉమీద్ రుణాన్ని పొందిన ఇన్షాకు డీఏవై ఎన్ఆర్ఎల్ఎం నుంచి కూడా ఆర్ధిక సాయాన్ని పొందింది. ఎట్టకేలకు ఆమె తన దుకాణాన్ని ఏర్పాటు చేసింది. 

డీఏవై ఎన్ఆర్ఎల్ఎం తన కలను నిజం చేసిందని , ఈ పథకం కింద సబ్సిడీ రుణాన్ని పొందకపోతే ఆమె తన వ్యాపారాన్ని ప్రారంభించలేకపోవచ్చునని ఇన్షా పేర్కొన్నారు. యువతకు సాయం చేస్తూ కొత్త అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వ వ్యాపార పథకాలను ఇన్షా కొనియాడారు. నిరుపేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా విజయవంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇవాళ ఇన్షా తన ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించడమే కాకుండా పలువురు మహిళలకు కూడా ఉపాధిని అందిస్తున్నారు. 

click me!