భార్య మీద అనుమానంతో విషం తాగిన భర్త... ఆ భార్య ఏం చేసిందంటే...

By AN TeluguFirst Published Aug 16, 2021, 12:22 PM IST
Highlights

గుజరాత్ లోని సురేంద్రనగర్ లో ఉంటున్న అరవింద్ కు 20 యేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇద్దరు కొడుకులు. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఆఫీస్ లో సహోద్యోగులు, స్నేహితులు పెళ్లి గురించి, భార్యల గురించి చేసే వ్యాఖ్యలను అరవింద్ సీరియస్‌గా తీసుకున్నాడు.

గుజరాత్ : చిన్న అనుమానం ఆ కాపురంలో చిచ్చు పెట్టింది. 20 యేళ్ల దాంపత్యానికి తూట్లు పొడిచింది. ఇద్దరు పిల్లలను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఏ తప్పూ చేయని భార్యను ఇబ్బందుల్లో పడేసింది. భర్త ప్రాణాల మీదికి తెచ్చింది. చెప్పుడు మాటలు అనవసరపు అనుమానాలే ఇంత దారుణానికి దారి తీశాయి. 

గుజరాత్ లోని సురేంద్రనగర్ లో ఉంటున్న అరవింద్ కు 20 యేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇద్దరు కొడుకులు. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఆఫీస్ లో సహోద్యోగులు, స్నేహితులు పెళ్లి గురించి, భార్యల గురించి చేసే వ్యాఖ్యలను అరవింద్ సీరియస్‌గా తీసుకున్నాడు. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. ఎరితో మాట్లాడినా అనుమానపడేవాడు. 20 యేళ్లుగా కలిసి ఉన్నా తనను నమ్మకపోతుండడంతో భర్తమీద అసహనం వ్యక్తం చేస్తుండేది. భర్త ఆమె మీద ఎప్పుడూ నిఘా పెట్టేవాడు. 

ఇన్నేళ్లుగా ఎప్పుడూ, ఏ తప్పూ చేయని భార్య సహనంతోనే ఉండేది. ఎదురు చెప్పకపోయేది. భర్త అనుమానానికి కారణం తెలియక మధనపడుతుండేది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఆమెను నమ్మలేదు. పిల్లలను తీసుకుని వేరే ఇంటికి మకాం మార్చేశాడు. దీంతో ఆమె కోర్టులో కేసేసింది. అది తట్టుకోలేక అతను విషం మింగేశాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో ఈ ఘటన జరిగింది. 

అయితే అరవింద్ లో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకూ అతని తీరు విపరీతంగా మారిపోయింది. దీంతో తీవ్ర ఒత్తిడికి, బాధకు గురైన ఆమె భర్తకు ఎదురు తిరిగింది. దీంతో గొడవలై ఇద్దరూ భర్త భార్యను వదిలేశాడు. పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లిపోయాడు. ఒంటరిగా మిగిలిన ఆమెకు ఆదాయ మార్గం లేదు. ఎలా బతకాలో తోచని స్థితి.

దీంతో భర్తనుంచి తనకు నెలనెలా డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నుంచి అదరవింద్ కు నోటీసులు వచ్చాయి. ఇది అరవింద్ కు ఆగ్రహం తెప్పించింది. అవమానంగా ఫీలయ్యాడు. గత శనివారం పాలలో విషం కలుపుకుని తాగేశాడు. చుట్టుపక్కల వాళ్లు సకాలంలో గుర్తించి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. కాగా, ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 

click me!