సైకిల్‌పై వచ్చి కేంద్ర మంత్రులుగా ప్రమాణం

Published : May 31, 2019, 05:25 PM IST
సైకిల్‌పై వచ్చి కేంద్ర మంత్రులుగా ప్రమాణం

సారాంశం

 మోడీ కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కిన ఇద్దరు సైకిల్ పై ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.

న్యూఢిల్లీ: మోడీ కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కిన ఇద్దరు సైకిల్ పై ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.

గురువారం నాడు రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ మోడీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులతో ప్రమాణస్వీకారం చేయించారు.మనుష్క్ లాల్ మాండవియా, అర్జున్ మేఘవాల్ తమ ఇంటి నుండి సైకిల్‌పై రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు.

46 ఏళ్ల మాండవియా గత ఐదేళ్ల పాటు సైకిల్‌పై పార్లమెంట్ కు వచ్చేవారు. గుజరాత్ రాష్ట్రంలోని మాండవియా 2002లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 28 ఏళ్ల వయస్సులోనే మాండవియా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర రీజియన్ లోని భావ‌్‌నగర్ జిల్లాలోని పాలిటానా తాలుకాలో హనోల్ గ్రామం  మాండవియా.

సాధారణ రైతు కుటుంబానికి చెందిన వాడు మాండవియా. మోడీ కేబినెట్‌లో మాండవియా రెండో దఫా కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. అర్జున్ రామ్ మేఘవాల్ మాజీ ఐఎఎస్ అధికారి. 

తన సమీప బంధువు, కాంగ్రెస్ అభ్యర్థి  మదన్‌గోపాల్ మేఘవాల్‌ను ఓడించాడు. బికనీర్ ఎంపీ స్థానం నుండి ఆయన విజయం సాధించారు.  గత టర్మ్‌లో కూడ మేఘవాల్ మోడీ ప్రభుత్వంలో మేఘవాల్ మంత్రిగా కొనసాగారు.2009లో ఆయన తొలిసారిగా బికనీర్‌ నుండి ఎంపీగా విజయం సాధించారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?