విహారయాత్రలో విషాదం.. సిక్కింలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి..

Published : May 30, 2022, 11:18 AM IST
విహారయాత్రలో విషాదం.. సిక్కింలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి..

సారాంశం

థానేలో కారు లోయలో పడ్డ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు, మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చాలాకాలం తరువాత విహారయాత్రకు వెళ్లి ఇలా ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. 

థానే: సిక్కింలో శనివారం రాత్రి ఘోర కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో థానేకు చెందిన బంగారు వ్యాపారి కుటుంబంతో పాటు చిన్నారుల స్నేహితుడు, కారు డ్రైవర్ కూడా మరణించారు. కోవిడ్ తర్వాత చాలా కాలంగా ఎదురుచూస్తున్న విహార యాత్రకు వెళ్లడానికి వీరు ఉత్సాహంగా బయలు దేరారని కుటుంబసభ్యులు తెలియజేశారు.

థానేలోని బంగారు వ్యాపారి సురేష్ పునమియా, అతని భార్య తోరల్ 37, వారి ఇద్దరు కుమార్తెలు, వారి 14 ఏళ్ల స్నేహితుడు సిక్కింలోని లోయలో పడి మరణించారు. లోయలో దాదాపు 400 అడుగుల లోతులోకి కారు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించి.. కారులోని అందరు మరణించినట్లు కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు. శనివారంనాడు జరిగిన ఈ ప్రమాదంలో ఆ 14యేళ్ల స్నేహితుడు పునమియాలతో కలిసి వెడతానని పట్టుబట్టి మరీ వెళ్లాడని ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జైన్ కమ్యూనిటీ-ఆధిపత్యం ఉన్న టెంభి నాకాలో ఉంటున్న కుటుంబం మే 26న థానే నుండి తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వ్యాపార సహోద్యోగులతో 10 రోజుల ఈశాన్య పర్యటనకు బయలుదేరిందని థానేకి చెందిన వారి బంధువులు తెలిపారు. “పిల్లలు తమ పరీక్షల తర్వాత, కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ల అనంతరం చాలా గ్యాప్ తర్వాత ఈ ట్రిప్ కి వెడుతున్నందున్న చాలా ఉత్సాహంగా ఉన్నారని, ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేశారని వారు అంటున్నారు. 

విహారయాత్రలో ఒకరోజు ముగిసి తిరిగి వారు తమ హోటల్‌కి తిరిగి వస్తుండగా సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వారి కారు మిగతావారి కార్లకంటే వెనక ఉంది. అయితే మిగతావారంతా హోటల్ కు చేరుకున్నా వీరు రాకపోవడంతో.. ఆ బృందంలోని ఇతర సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. ఆ తరువాత  కొద్దిసేపటికి ప్రమాదం గురించి తెలిసింది’’ అని కుటుంబ సభ్యుడు జితేంద్ర జైన్ తెలిపారు.

ఈ ఘటన మీద సామాజిక కార్యకర్త, వీరి ఫ్యామిలీ ఫ్రెండ్, సుమన్ అగర్వాల్ మాట్లాడుతూ, పునమియాలు సామాజిక సేవ, మతపరమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో తమ సమాజంలో ప్రసిద్ధి చెందారని అన్నారు. స్థానిక శివసేన కార్పొరేటర్ సుధీర్ కొకాటే మాట్లాడుతూ.. నగరానికి చెందిన బంగారు వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురు తోబుట్టువులలో చిన్నవాడైన సురేష్.. గత శనివారం సాయంత్రమే తమ బంధువుతో మాట్లాడారని.. ఆ సమయంలో ఆయన చాలా రిలాక్స్‌గా ఉన్నాడని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?