జమ్మూ ఎస్‌కెఐఎంఎస్ మెడికల్ కాలేజీ లో ఉగ్రవాదుల కాల్పులు: తిప్పికొట్టిన ఆర్మీ

By narsimha lodeFirst Published Nov 5, 2021, 4:02 PM IST
Highlights


జమ్మూకాశ్మీర్ లోని ఎస్‌కెఐఎంఎస్ మెడికల్ కాలేజీలో ఉగ్రవాదులు దాడికి దిగారు. అయితే ఉగ్రవాదుల దాడిని ఆర్మీ తిప్పికొట్టింది. పౌరులను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులు తప్పించుకొన్నారు.

శ్రీనగర్: Jammu, Kashmirలోని ఎస్‌కెఐఎంష్ మెడికల్ కాలేజీపై శుక్రవారం నాడు ఉగ్రవాదులు దాడికి దిగారు. బెమీనాలోని SKIMS ఆసుపత్రిలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి.  సామాన్యులను అడ్డు పెట్టుకొని ఉగ్రవాదులు తప్పించుకొన్నారని సమాచారం.

Terrorists కాల్పులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అయితే ఈ ఆసుపత్రిని భద్రతా బలగాలు చుట్టుముట్టారు. భారీగా భద్రతా బలగాలు ఆసుపత్రిని చుట్టుముట్టడంతో టెర్రరిస్టులు అక్కడి నుండి తప్పించుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఆసుపత్రికి వచ్చిన సాధారణ పౌరులను అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులు ఆసుపత్రి నుండి పారిపోయారు. ఈ ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు.  పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా జమ్మూ పోలీసులు ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్ లో ఈ దాడి ఈ నెలలో ఇది మొదటిది. గత అక్టోబర్ మాసంలో ఉగ్రవాదులు ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 11 మంది పౌరులను చంపారు. కాశ్మీర్ లోయలో యాంటీ టెర్రర్ ఆపరేషన్  కొనసాగుతుంది.పూంచ్ జిల్లాలో ఉగ్రమూకల ఏరివేత కోసం భద్రతా దళాలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి.ఈ ఆపరేషన్స్ లో  కీలకమైన ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరోవైపు భద్రతా దళాల వైపు కూడా ప్రాణనష్టం చోటు చేసుకొంది.

రాజౌరీ, నౌషీరా ప్రాంతాల్లోని ఆర్మీ జవాన్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ వేడుకలు జరిగిన మరునాడే ఈ ఆసుపత్రిపై ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు వారికి సహకరించే మిలిటెంట్లను ఏరివేసే కార్యక్రమాలను భద్రతా బలగాలు ఇటీవల కాలంలో ముమ్మరం చేశాయి. 

2014 నుండి ప్రతి దీపావళి నుండి ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి వేడుకలను ఆర్మీ జవాన్ల మధ్య జరుపుకొంటున్నారు. నిన్న  కూడా దీపావళి వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేవిధంగా ఆయన ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయు ఆశీర్వాదాలతో తాను ఇక్కడికి వచ్చినట్టుగా మోడీ తెలిపారు.


 

click me!