యాపిల్ లారీలో పట్టుబడ్డ టెర్రరిస్ట్

By telugu teamFirst Published Sep 28, 2019, 4:16 PM IST
Highlights

నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి రాజధాని ఢిల్లీ కి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్ లో ఉగ్రవాది వస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 

న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి రాజధాని ఢిల్లీ కి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్ లో ఉగ్రవాది వస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 

నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న అంబాలా పోలీసులు చాల చాకచక్యంగా వలపన్ని ఈ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు అంబాలా పోలీసులు. అరెస్ట్ చేసిన తరువాత విచారణ నిమిత్తం జమ్మూ పోలీసులకు ఈ ఉగ్రవాదిని అప్పగించారు. 

అరెస్ట్ అయిన ఉగ్రవాది పలు కేసుల్లో నిందితుడిగా ఉండడంతో వేర్వేరు దర్యాప్తు సంస్థలు విచారించేందుకు సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో భారత నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. 

click me!