ఖాళీ చేయండి.. రైతులతో స్థానికుల వార్, సింఘులో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jan 29, 2021, 03:29 PM IST
ఖాళీ చేయండి.. రైతులతో స్థానికుల వార్, సింఘులో ఉద్రిక్తత

సారాంశం

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు రిపబ్లిక్ డే రోజున హద్దు మీరారు. దీంతో రైతుల వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకాలంగా అన్నదాతలకు అండగా నిలబడిన ప్రజలు తిరగబడుతున్నారు. 

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులు రిపబ్లిక్ డే రోజున హద్దు మీరారు. దీంతో రైతుల వైఖరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకాలంగా అన్నదాతలకు అండగా నిలబడిన ప్రజలు తిరగబడుతున్నారు. 

ఢిల్లీ -  హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు గత కొన్ని రోజులుగా ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు కొంతమంది ఆందోళనకు దిగారు.

ఓ దశలో రైతుల గుడారాలపైకి రాళ్లు విసిరినట్లు సమాచారం. అలాగే కొన్ని టెంట్లను పీకివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు, స్థానికుల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.  

Also Read:మా ప్రాంతాన్ని ఖాళీ చేయండి: రైతులపై స్థానికుల ఆగ్రహం, ఢిల్లీలో ఉద్రిక్తత

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికులను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో లాఠీఛార్జి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాష్పవాయువు కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది.

సింఘు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కొందరు స్థానికులు గురువారమే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఒక్క రోజులో వెళ్లిపోవాలని రైతులను హెచ్చరించారు. అయినా, రైతులు అక్కడే బైఠాయించడంతో.. శుక్రవారం స్థానికులు ఆందోళనకు దిగారు.  

మరోవైపు ఆందోళన కొనసాగుతున్న ఇతర ప్రాంతాల్లో వాతావరణం వేడెక్కింది. అర్ధరాత్రిలోగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్‌ను ఖాళీ చేయాలంటూ నిన్న ఘజియాబాద్‌ పాలనా యంత్రాంగం రైతులకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వెళ్లిపోని పక్షంలో తామే తొలగిస్తామని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

కాగా, రైతు ఉద్యమకారులపై కేంద్రం అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెంచుతోంది. వారిపై రకరకాల కేసులు పెట్టడంతోపాటు శిబిరాల్లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు అందకుండా చేస్తోంది. ఈ పరిణామాలతో ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?