రాహుల్ లేదా ప్రియాంక ఎవరైనా ఒకే: కాంగ్రెస్ రథసారథి ఎంపిక పై తెలుగు రాష్ట్రాలు

By Nagaraju penumalaFirst Published Aug 10, 2019, 3:52 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి ఎంపికపై తెలుగు రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ అధ్యక్షత వైపే మెుగ్గు చూపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ స్పష్టం చేశారు. 
 
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారథి ఆ పార్టీకి కొత్త చిక్కుముడులు తెచ్చిపెడుతోంది. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానాలు చేస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ నూతన రథసారథి ఎంపికపై తెలుగు రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాహుల్ గాంధీ అధ్యక్షత వైపే మెుగ్గు చూపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ స్పష్టం చేశారు. 

రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉండేందుకు ససేమిరా అంటే పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని ఏఐసీసీ అధ్యక్షురాలుగా నియమించాలని కోరారు. సాయంత్రం మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం కానున్న నేపథ్యంలో తమ తీర్మానాలను సీడబ్ల్యూసీకి సమర్పించాలని తెలుగు రాష్ట్రాల నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

click me!