ఇల్లు ఊడవలేదని కూతురిని మందలించిన తల్లి.. మనస్తాపంతో ఆమె చేసిన పని షాకింగ్...

Published : Aug 08, 2023, 01:34 PM IST
ఇల్లు ఊడవలేదని కూతురిని మందలించిన తల్లి.. మనస్తాపంతో ఆమె చేసిన పని షాకింగ్...

సారాంశం

ఇల్లు శుభ్రం చేయలేదని తల్లి మందలించడంతో ఓ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. 

చెన్నై : ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఫోన్ చూడొద్దన్నందుకు, ఆడుకోవద్దు అన్నందుకు, పరీక్షలో ఫెయిల్ అవుతానని భయంతో.. ఇలా అతి స్వల్ప విషయాలకే  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో వెలుగు చూసింది. ఇంటిని శుభ్రం చేయడం లేదని ఓ తల్లి కూతురుని  మందలించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పుదుపట్టు గ్రామానికి చెందిన సభాపతి (42) తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.. అతనికి  వివాహమై భార్య కవియరసి.. పిల్లలు రాకేష్ (16),  దర్శినిక (15), సంజిత్ (12)లు ఉన్నారు.

అమానుషం.. ఆరేళ్ల చిన్నారిపై 15యేళ్ల బాలుడు అత్యాచారం.. అరెస్ట్..

పన్నూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో పిల్లలు ముగ్గురు చదువుకుంటున్నారు. ఆదివారం నాడు వీరి ఊర్లో ఓ జాతర జరిగింది. ఊరంతా పండుగ సందర్భంగా ఇల్లు నీటుగా పెట్టుకోవాలని.. ఇంటిని శుభ్రం చేయమని పెద్ద కూతురు దర్శినికాకు తల్లి పురమాయించింది. కానీ దర్శనిక ఆ పని చేయలేదు. దీంతో తల్లి కవియరసి మందలించింది. తల్లి కొప్పడడంతో తీవ్ర మనస్తాపం చెందిన దర్శినిక… ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

ఈ మేరకు తండ్రి సభాపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు  ప్రకారం కేసు నమోదు చేసుకున్న ముప్పేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకు ఎంతో సంతోషంగా తిరిగిన అమ్మాయి ఒకసారిగా మృతి చెందడంతో స్థానికంగా విషాదాన్ని నింపింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?