మధ్యప్రదేశ్ లో పరువు హత్య !?.. పట్టపగలు, నడిరోడ్డుపై మైనర్ల గొంతుకోసి హత్య...!!

Published : Oct 11, 2022, 10:50 AM IST
మధ్యప్రదేశ్ లో పరువు హత్య !?.. పట్టపగలు, నడిరోడ్డుపై మైనర్ల గొంతుకోసి హత్య...!!

సారాంశం

మధ్యప్రదేశ్ లో నట్టనడివీధిలో.. పట్టపగలు ఓ మైనర్ జంటను గొంతుకోసి హత్య చేశారు. అయితే ఇది పరువు హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మధ్యప్రదేశ్ : భోపాల్ లో ఓ దారుణ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నడి రోడ్డు మీద ఇద్దరి మృతదేహాలు గొంతుకోసి కనిపించాయి. ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. ఎంపీ పన్నా జిల్లాలో సోమవారం పట్టపగలు ఓ యువకుడు, బాలిక హత్యకు గురయ్యారు. బాలిక 9వ తరగతి విద్యార్థిని కాగా, అబ్బాయి వయస్సు 18 సంవత్సరాలు. వారి మృతదేహాలు గొంతు కోసి రోడ్డుపై పడేసి కనిపించాయని పోలీసులు తెలిపారు.

ఇది గమనించిన ఓ బాటసారి.. మృతదేహాల ఫోటోలను తీసి పోలీసులకు పంపించాడు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ నిపుణులు పరిశోధన ప్రారంభించారు. ఫోరెన్సిక్ వారి సమాచారం ప్రకారం బాలిక మెడ వెనుక భాగంలో లోతైన గాయం ఉందని, బాలుడి గొంతు ముందు నుండి కోసినట్టుగా ఉందని తెలుస్తోంది. ఇద్దరి శరీరం మీద అనేక కత్తిపోట్లు ఉన్నాయి. బాలిక తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వెంబడించి వెనుక నుంచి నరికి చంపిన ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

దారుణం.. త‌క్కువ కులం వ్య‌క్తిని ప్రేమించింద‌ని కూతురిని చంపి, మృత‌దేహాన్ని కాల్చేసిన రైతు..

ఈ ఘటనతో మండలంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాధితులిద్దరూ ఒకే కులానికి చెందిన వారని, అయితే పరిస్థితులు, ఘటనా స్థలాన్ని గమనిస్తే పరువు హత్యగా అనిపిస్తుందని పోలీసులు తెలిపారు. వారిది ట్రయాంగిల్ ప్రేమ నా? ప్రేమను నిరాకరించిన వారు చేసిన పనా? ఫ్యామిలీకి ఉన్న శతృవుల పనా? అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తు్నారు. అయితే, మధ్యాహ్నం జరిగిన హత్య విషయంలో అర్ధరాత్రి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇక బాలిక ఒంటరిగా ఉంటోంది. స్కూల్ కు వెడుతూ చదువుకుంటోంది. ఆమె తల్లిదండ్రులు రేవాలో పనిచేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu