నీళ్లలో మత్తమందు కలిపి.. కారులోకి తోసి షాపింగ్ మాల్ లో.. మహిళా టెకీపై అత్యాచారం..

Published : Feb 14, 2023, 11:56 AM ISTUpdated : Feb 14, 2023, 11:59 AM IST
నీళ్లలో మత్తమందు కలిపి.. కారులోకి తోసి షాపింగ్ మాల్ లో.. మహిళా టెకీపై అత్యాచారం..

సారాంశం

ఉద్యోగం పేరుతో ఓ మహిళా టెకీని పిలిచిన ఓ వ్యక్తి ఆమెకు నీళ్లలో మత్తుమందు కలిపి ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. 

గురుగ్రామ్ : హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. 27 ఏళ్ల మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్  అత్యాచారానికి గురైంది. ఉద్యోగం కోసం వెడితే ఈ దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు.గురుగ్రామ్ లోని సహారా మాల్ లోని బేస్మెంట్లో ఈ ఘటన జరిగింది.  బేస్మెంట్లో పార్క్ చేసి ఉన్న కారులో ఆమె మీద అత్యాచారం జరిపారు. తనకు మత్తుమందు ఇచ్చి తన మీద అత్యాచారం జరిపారని ఆమె తెలిపింది. ఈ ఘటన గురుగ్రామ్ లో సంచలనం రేపింది. ఆ మహిళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్.  కొత్త ఉద్యోగం కోసం  ప్రయత్నాలు చేస్తోంది. ఆమెను ఇంటర్వ్యూ పేరుతో పిలిచి  నీళ్లలో మత్తుమందు కలిపి  ఇచ్చాడు నిందితుడు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత  బాధిత యువతి సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్ లో అత్యాచారం విషయాన్ని ఫిర్యాదు చేసింది. ఉద్యోగాన్వేషణలో భాగంగా యువతికి నిందితుడు పరిచయం అయ్యాడు. తుషార్ శర్మ అనే వ్యక్తిని తాను ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతుకుతూ సంప్రదించానని.. ఉద్యోగం ఇప్పిస్తానని అతను హామీ ఇచ్చాడని.. బాధితురాలు తన ఫిర్యాదులో  తెలిపింది. తుషార్ శర్మ సహార మాల్ లో ఇంటర్వ్యూ ఉందని గత శనివారం బాధితురాలిని రమ్మని పిలిచాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె తన సర్టిఫికెట్లతో  సహారా మాల్ కు చేరుకుంది. అప్పటికే అక్కడ వేచి ఉన్న తుషార్ శర్మను కలిసింది.

అత్యాచారాన్ని సులభతరం చేసిన మహిళపై ‘‘గ్యాంగ్ రేప్’’ కేసు విచారణ చేయవచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇంటర్వ్యూకు ఇంకా టైం ఉందని కాసేపు రిలాక్స్ అవ్వమని చెప్పాడు. అప్పటివరకు వెయిట్ చేద్దాం అంటూ ఆమెను బేస్మెంట్లోని తన కారు దగ్గరికి తీసుకువెళ్లాడు. మంచినీళ్లు తాగమంటూ బాటిల్ అందించాడు. ఆ నీరు తాగిన యువతి వెంటనే స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన ఆమెని కారులోకి తోసేశాడు. ఆ తరువాత ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు శర్మ. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత స్పృహలోకి వచ్చిన తాను జరిగింది తెలుసుకొని షాకయ్యానని, అతడిని నిలదీశానని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని శర్మ తనను బెదిరించాడని.. వెంటనే అక్కడే పార్కింగ్లో తనను ఒంటరిగా వదిలేసి పారిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అక్కడినుంచి ఎలాగో బైటికి వచ్చిన తాను వెంటనే పోలీసులను ఆశ్రయించానని చెప్పుకొచ్చింది. ఈ మేరకు కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆ యువతీని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. నిందితుడైన తుషార్ శర్మపై ఐపీసీ సెక్షన్ 328, 376, 506 పై కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు. నిందితుడి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని.. అత్యాచారానికి సంబంధించిన ఆధారాల కోసం మాల్ లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కఠినంగా శిక్షించేలా చూస్తామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం