ఉపాధ్యాయుడి కీచక పర్వం..ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. ఆపై..

By Rajesh KarampooriFirst Published Feb 9, 2023, 6:41 AM IST
Highlights

సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడే మృగంలా వ్యవహరించిన ఘటన తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో  తీవ్ర కలకలం సృష్టిస్తుంది. మూడో తరగతి చదువుతున్న చిన్నారిని.. వ్యాయమ ఉపాధ్యాయుడు ప్రలోభపెట్టి పాఠశాలలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు

దేశంలో రోజు రోజుకీ మహిళలు, చిన్నారులపై  అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకపోయిన కొందరూ.. చిన్నా పేద్దా అనే తేడా లేకుండా .. ఆడవాళ్లంటే.. చాలు చిత్తకార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం కేవలం మనకు విద్యాబుద్దులు నేర్పించే గురువుకే ఇస్తాం. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఓ గురువులు కీచకుల్లా మరిపోయాడు. అభం శుభం తెలియని ఎనిమిదేండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణానికి తెగబడి.. గురువు స్థానానికే మచ్చ తెచ్చారు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో చోటు చేసుకుంది.  

వివారాల్లోకెళ్లే.. తూర్పు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 40 ఏళ్ల ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణలో ఎనిమిదేళ్ల 3వ తరగతి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్రీడా ఉపాధ్యాయుడు 2016 నుండి తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో పనిచేస్తున్నారు. గత వారం మూడో తరగతి చదువుతున్న చిన్నారిని ఆ ఉపాధ్యాయుడు ప్రలోభపెట్టి పాఠశాలలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పితే.. బాగోదని బెదిరించాడు. 

చిన్నారి ప్రవర్తనపై ఆమె తల్లికి అనుమానం రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల చిన్నారి తన తల్లి అడిగితే జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. నాలుగు, ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై తమకు కాల్ రావడంతో ఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) అమృత గుగులోత్ తెలిపారు.

బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్‌ చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గుగులోత్ తెలిపారు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడే మృగాళ్లలా వ్యవహరించిన ఘటన తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని పాఠశాలలో  తీవ్ర కలకలం సృష్టిస్తుంది.
 

click me!