తమిళనాట మరోసారి క్యాంప్ రాజకీయాలు.. రిసార్ట్‌కు శశికళ వర్గం

sivanagaprasad kodati |  
Published : Oct 23, 2018, 07:42 AM IST
తమిళనాట మరోసారి క్యాంప్ రాజకీయాలు.. రిసార్ట్‌కు శశికళ వర్గం

సారాంశం

తమిళనాడులో మరోసారి క్యాంప్ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళ వర్గంలోని 18 మందిని దినకరన్ రిసార్ట్‌కు తరలించడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి

తమిళనాడులో మరోసారి క్యాంప్ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో శశికళ వర్గంలోని 18 మందిని దినకరన్ రిసార్ట్‌కు తరలించడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి.

ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు తిరునల్వేలి జిల్లా కుట్రాళం ఇసాక్కి రిసార్ట్‌కు చేరుకున్నారు. ఒకవేళ దినకరన్‌కు అనుకూలంగా న్యాయస్థానం తీర్పును వెలువరిస్తే రాజకీయాలు వేగంగా మారే అవకాశాలున్నాయి.

జయలలిత మరణానంతరం శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సీఎం కుర్చీ కోసం క్యాంప్ రాజకీయాలు నడిచాయి. అలాగే సీఎం పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించారు. ప్రస్తుత తీర్పు నేపథ్యంలో తమిళనాడు పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?