అభినందన్‌కు పరమ వీర చక్ర ఇవ్వాలి: తమిళనాడు సీఎం

Published : Mar 08, 2019, 06:19 PM IST
అభినందన్‌కు పరమ వీర చక్ర ఇవ్వాలి: తమిళనాడు సీఎం

సారాంశం

పాకిస్తాన్ ఆర్మీకి బందీగా చిక్కి ఇండియాకు తిరిగొచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు పరమ వీర్ చక్ర ఇవ్వాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  


చెన్నై:పాకిస్తాన్ ఆర్మీకి బందీగా చిక్కి ఇండియాకు తిరిగొచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు పరమ వీర్ చక్ర ఇవ్వాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం నాడు ఓ లేఖ రాశారు. అభినందన్ కు పరమ్ వీర్ చక్ర ఇవ్వాలని ఆ లేఖలో మోడీని పళనిస్వామి కోరారు.తన ప్రతిపాదనపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మిగ్-21 యుద్ధ విమానం పాక్ విమానాన్ని వెంటాడుతూ కుప్పకూలింది. ఈ విమానం నుండి పైలట్ అభినందన్ సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డాడు. రెండు రోజుల తర్వాత అభినందన్ స్వదేశానికి తిరిగి వచ్చారు. 

తమిళనాడు రాష్ట్రంలో అన్నాడిఎంకె, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఈ తరుణంలో  అభినందన్ కు పరమ్ వీర్ చక్ర  అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈ కూటమికి కలిసొచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు