జమ్మూ బస్టాండ్‌లో పేలుడు: నిందితుడు 9వ తరగతి విద్యార్ధి

By Siva KodatiFirst Published Mar 8, 2019, 5:01 PM IST
Highlights

జమ్మూలో గ్రెనేడ్ దాడికి పాల్పడింది తొమ్మిదో తరగతి విద్యార్ధిగా పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనెడ్ తయారు చేసినట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి

జమ్మూలో గ్రెనేడ్ దాడికి పాల్పడింది తొమ్మిదో తరగతి విద్యార్ధిగా పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనెడ్ తయారు చేసినట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి.

లంచ్ బాక్స్‌లో గ్రెనేడ్‌ను తీసుకొచ్చిన అతను జమ్మూ బస్టాండ్ లక్ష్యంగా దాడి చేసినట్లు వెల్లడించారు. నిందితుడు జమ్మూకు రావడం ఇదే తొలిసారని, అతను బుధవారమే కారులో ఇక్కడికి చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

మైనర్ అయిన నిందితుడు ఒక్కడేప 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు. అది వన్ వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఇది ఎలా సాధ్యమైందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో నిందితుడు మాట్లాడినట్లు జమ్మూ ఐజీ తెలిపారు.

ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడని గురువారం ఉదయం తాను జమ్మూ చేరుకున్నట్లు నిందితుడు అంగీకరించాడని ఆయన చెప్పారు. గురువారం జమ్మూ బస్టాండ్‌లో జరిగిన బాంబు పేలుడులో 32 మంది పౌరులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 
 

click me!