అధికార పార్టీ అగడాలు.. శుభశ్రీ ప్రాణం పోతే.. అనురాధ కాలు పోయింది

By Rekulapally SaichandFirst Published Nov 16, 2019, 4:00 PM IST
Highlights

తమిళనాట రాజకీయల పార్టీల ప్రచార హోరు  అక్కడి జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.అనురాధ రాజేశ్వరి అనే మహిళ కోయంబత్తూరు హైవే మీదుగా స్కూటీపై ఆఫీసుకు  వెళ్తుంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం కింద  పడటం గమనించింది. దీంతో ఆమె అప్రమత్తం అయి తప్పించుకునే ప్రయత్నం చేసింది.

తమిళనాట రాజకీయల పార్టీల ప్రచార హోరు అక్కడి జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ శ్రేణుల అత్యుత్సాహం కారణంగా ఓ మహిళ తన కాలు కోలుపోవాల్సి వచ్చింది.

అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె కాలు మోకాలు కింది భాగం మొత్తాన్ని  వైద్యులు  తొలగించారు.


అనురాధ రాజేశ్వరి అనే మహిళ కోయంబత్తూరు హైవే మీదుగా స్కూటీపై ఆఫీసుకు  వెళ్తుంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం కింద  పడటం గమనించింది. దీంతో ఆమె అప్రమత్తం అయి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె స్కూటీ నుంచి కిందపడిపోయింది.  అప్పుడే ఎదురుగా వస్తున్న ఓ లారీ ఆమె కాళ్ల మీద నుంచి వెళ్ళింది. 

ఈ సంఘటనలో ఆమెకు తీవ్రగాయలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు స్థానికులు.  ఎడమ కాలు భాగం చితికిపోవడంతో దాన్ని తొలగించినట్లు ఆస్పత్రి వైద్యులు శనివారం తెలిపారు. దీంతో ఆమె కుటుంబ పరిస్ధితి ప్రశ్నార్థకంగా మారింది.  

తమ ఒక్కగానొక్క కూతురి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ అనురాధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు  బిడ్డకు ఇలాంటి  దుస్థితి రావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  తమ కూతురికి ఇలా జరగడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

 

ఇలాంటి సంఘటనలు తమిళనాడు కొత్తమే కాదు గతంలో  శుభశ్రీ అనే టెకీ ఓ పార్టీ ప్లేక్సీ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. తాజాగా జరిగిన అనురాధ ఉదంతంతో బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా  మారాయి. అయితే ఈ ప్రమాదాలు అధికార పార్టీ అతి ఉత్సహం వల్లనే జరిగాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు  అన్నాడీంకే పార్టీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండా వల్లనే శుభశ్రీ  అనురాధ ప్రమాదం బారిన పడ్డారని మండిపడుతున్నారు.

click me!