
ఆదా శర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). అయితే.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ వివాదానికి తెరలేపింది. ఈ ట్రైలర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేరళలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయనే ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు చిత్రనిర్మాతలు వెల్లడిస్తున్నారు. హిందూ, క్రిస్టియన్ యువతులను ట్రాప్ చేసిన ముస్లిం మతంలోకి లాగారనీ, వారితో బలవంతంగా వారిని ISISలో చేర్చి తమ కార్యకలాపాలకు వాడుకున్నట్లు The Kerala Story ట్రైలర్ లో చూపించారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు స్టేట్ లో హై అలర్ట్ నెలకొంది. నిఘా సంస్థలు హెచ్చరిక జారీ చేశాయి. ఈ చిత్రం విడుదల రాష్ట్రంలో విస్తృత నిరసనలకు దారితీయవచ్చని హెచ్చరించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ సినిమాపై ఇప్పటికే కేరళలో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. తాజాగా తమిళనాడులోనూ కేరళ స్టోరీ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది.
ఈ విషయంలో రాజకీయపార్టీలు జోక్యం చేసుకోవడంతో ఈ అంశానికి రాజకీయ రంగు పులుముకుంది. సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. కేరళ సీఎం (Kerala CM) పినరయి విజయన్ స్పందిస్తూ.. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే దురుద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారనీ, రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ్ పరివార్ లాంటి సంస్థలు.. ఇలాంటి విద్వేష ప్రచారానికి తెర తీసున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.
మరోవైపు ఈ సినిమాకు బీజేపీ మద్దతుగా నిలిచింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ మాట్లాడుతూ.. కేరళ సిఎం, అధికార సిపిఐ(ఎం)లు "ద్వంద్వ వైఖరి"గా అభివర్ణించారు. వారి "ఎలెక్టివ్ భావప్రకటన స్వేచ్ఛా విధానాన్ని" నిందించారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు, కేరళ స్టోరీలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు.
రాష్ట్రంలోని 32,000 మంది బాలికలు తప్పిపోయారని , ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్‌లో చేరారని కేరళ స్టోరీ ట్రైలర్‌పై చూపించారు. కేరళలోని CPI(M), కాంగ్రెస్ ప్రకారం.. మహిళలు మతం మారారని, రాడికల్‌గా మారారని, భారతదేశంలో ప్రపంచంలోని ఉగ్రవాద కార్యకలాపాలలో మోహరింపబడ్డారని ఈ చిత్రం తప్పుగా పేర్కొంది. మరోవైపు, కేరళ స్టోరీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికేట్ మంజూరు చేసింది. సెన్సార్ బోర్డు కూడా సినిమాలోని 10 సన్నివేశాలను తొలగించింది.