ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు  

Published : Sep 30, 2023, 11:34 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 8 మంది మృతి, పలువురికి గాయాలు   

సారాంశం

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు సహా 59 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడి ఎనిమిది మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు డ్రైవర్లు సహా 59 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు శుక్రవారం సాయంత్రం కూనూర్ నుంచి తెన్‌కాశికి వెళ్తుండగా లోయలో పడిపోయింది. పర్యాటకులు సందర్శన కోసం ఊటీకి వచ్చి ఇంటికి తిరిగి వస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెయిర్‌పిన్‌ రోడ్డుపై ప్రయాణిస్తుండగా బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్షించిన వారిలో ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించేలోగా మరణించినట్లు ప్రకటించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ప్రమాదానికి  గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం