కరోనాతో తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి కన్నుమూత

By telugu teamFirst Published Nov 1, 2020, 8:16 AM IST
Highlights

కరోనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతూ తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దొరై కన్ను శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కరోనా వ్యాధితో అక్టోబర్ 13వ తేదీన ఆస్పత్రిలో చేరారు.

చెన్నై: తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్ దొరైకన్నును కరోనా కాటేసింది. కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 ఏళ్లు

మంత్రికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు అక్టోబర్ 13వ తేదీన నిర్దారణ అయింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆయన కన్నూ మూశారు. తంజవూరు జిల్లా పాపనాశం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

72 ఏళ్ల అన్నాడియంకె నేత గత రాత్రి తుదిశ్వాస విడిచారని కావేరీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ చెప్పారు. ఈ మేరకు ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 

శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి ఆస్పత్రికి వెళ్లి దొరైకన్నును పరామర్శించారు. 

click me!