సీడబ్ల్యూసీలోకి మరో నలుగురిని తీసుకున్న సోనియా గాంధీ.. శాశ్వత ఆహ్వానితునిగా టి సుబ్బిరామి రెడ్డి

Published : Jun 23, 2022, 12:17 PM IST
సీడబ్ల్యూసీలోకి మరో నలుగురిని తీసుకున్న సోనియా గాంధీ..  శాశ్వత ఆహ్వానితునిగా టి సుబ్బిరామి రెడ్డి

సారాంశం

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీలో మరో నలుగురికి చోటు కల్పించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీలో మరో నలుగురికి చోటు కల్పించారు. వారిలో కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీ, టీ సుబ్బారామి రెడ్డి, అజయ్ కుమార్ లల్లూ ఉన్నారు. సీడబ్ల్యూసీలో సభ్యులుగా కుమారి సెల్జా, అభిషేక్ మను సింఘ్వీలను, శాశ్వత ఆహ్వానితునిగా టి సుబ్బిరామి రెడ్డిని, ప్రత్యేక ఆహ్వానితునిగా అజయ్ కుమార్ లల్లూ సోనియా గాంధీ నియమించారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకనట విడుదల చేశారు.  

 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?