రోహిత్ శర్మపై ఫన్నీ మీమ్.... అభిమానులకు స్విగ్గీ క్షమాపణలు..!

Published : Apr 15, 2021, 07:35 AM ISTUpdated : Apr 15, 2021, 07:39 AM IST
రోహిత్ శర్మపై ఫన్నీ మీమ్.... అభిమానులకు స్విగ్గీ క్షమాపణలు..!

సారాంశం

రోహిత్ అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో... స్విగ్గీ క్షమాపణలు చెప్పింది. తాము ఎలాంటి దురుద్దేశంతో రోహిత్ మీమ్ ని రీపోస్టు చేయలేదని తెలిపింది. తాము దానిని క్రియేట్ చేయలేదని.. కేవలం రీట్వీట్ చేశామని క్లారిటీ ఇచ్చింది.

టీమిండియా వైస్ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పై ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఫన్నీ మమ్ వేసింది. అది కాస్త రోహిత్ అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో... స్విగ్గీ క్షమాపణలు చెప్పింది. తాము ఎలాంటి దురుద్దేశంతో రోహిత్ మీమ్ ని రీపోస్టు చేయలేదని తెలిపింది. తాము దానిని క్రియేట్ చేయలేదని.. కేవలం రీట్వీట్ చేశామని క్లారిటీ ఇచ్చింది.

 

తాము ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని భావించలేదని.. క్షమించాలంటూ పేర్కొంది. ఇంతకీ ఈ మీమ్ మ్యాటరేంటంటే... కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ కు ముందు స్విగ్గీ  ఓ ఫోటో ట్వీట్ చేసింది. పావ్ బాజీ బండి వద్దకు రోహిత్ శర్మ డైవ్ చేసి మరీ పావ్ తీసుకుంటున్నట్లుగా రోహిత్ శర్మ ఫోటో ఉంది.

దానికి స్విగ్గీ ఓ కామెంట్ చేసింది. ‘‘ హేటర్స్ దీనిని ఫోటో షాప్ అంటారు’ అని పేర్కొంది. అది కాస్త రోహిత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ ఫోటో డిలీట్ చేసి.. క్షమాపణలు చెప్పకుంటే తమ ఫోన్ లోని స్విగ్గీ యాప్ ని తొలగిస్తామంటూ హెచ్చరించింది. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తారు. దీంతో స్విగ్గీ దిగి వచ్చి క్షమాపణలు చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం