గోల్డ్ స్మగ్లింగ్ కేసు: మంత్రులపై స్వప్నా సురేష్ లైంగిక ఆరోపణలు..!

Published : Oct 22, 2022, 11:51 AM IST
గోల్డ్ స్మగ్లింగ్ కేసు: మంత్రులపై స్వప్నా సురేష్ లైంగిక ఆరోపణలు..!

సారాంశం

మాజీ మంత్రులు కదంకంపల్లి సురేంద్రన్, థామస్ ఐజాక్, మాజీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్‌లపై స్వప్న సురేష్ లైంగిక ఆరోపణలు చేశారు.

కేరళను కుదిపేసిన బంగారం స్మగ్లింగ్‌లో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ మరోసారి సంచలనానికి తెరతీశారు. మాజీ మంత్రులు కదంకంపల్లి సురేంద్రన్, థామస్ ఐజాక్, మాజీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్‌లపై స్వప్న సురేష్ లైంగిక ఆరోపణలు చేశారు. కడకంపల్లి సురేంద్రన్ ఆమెను కొచ్చిలోని హోటల్ గదికి ఆహ్వానించగా, పి. శ్రీరామకృష్ణన్ అధికారిక నివాసానికి ఒంటరిగా రావాలని కోరారని, థామస్ ఐజాక్ ఆమెను మున్నార్‌కు తీసుకెళ్తానని చెప్పారని స్వప్న వెల్లడించారు.

చాతియుడే పద్మవ్యూహం పుస్తకాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా స్వప్న సురేష్ ఏసియానెట్ న్యూస్‌తో మాట్లాడారు. కడకంపల్లి సురేంద్రన్‌కు రాజకీయ నాయకుడిగా ఉండే అర్హత కూడా లేదని స్వప్న బహిరంగంగా చెప్పడం గమనార్హం. మాజీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని  స్వప్న అన్నారు. శివశంకర్ కు కూడా ఈ విషయాలు తెలుసునని స్వప్న వెల్లడించింది.

కాగా, స్వప్న సురేష్ చేసిన లైంగిక ఆరోపణలపై మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ఇప్పటి వరకు  స్పందించలేదు. స్వప్న చెప్పిన విషయాలేమిటో తనకు తెలియదని కడకంపల్లి అంటున్నారు. ఆమె ఏషియానెట్ మాట్లాడిన పూర్తి విషయాలను ఈ వీడియోలో చూసేయండి.
 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu